ఆధ్యాత్మికం

Wakeup : ఉదయం నిద్ర లేవగానే చూడకూడని, చూడవలసిన వస్తువులు ఇవే..!

Wakeup : ఉద‌యం నిద్ర లేవ‌గానే కొంద‌రు అర‌చేతి వేళ్ల‌ను చూసుకుంటారు. కొంద‌రు త‌మ‌కు ఇష్ట‌మైన వ‌స్తువును లేదా దేవుడి బొమ్మ‌ను చూస్తారు. ఇంకొంద‌రు ఇంకా వేరే వ‌స్తువుల‌ను చూస్తారు. అయితే వాస్త‌వానికి ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే చూడ‌కూడ‌ని, చూడాల్సిన వ‌స్తువులు కొన్ని ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం లేవగానే మగవారు జుట్టు విరబోసుకుని ఉన్న తన భార్యను చూడకూడదట. అదేవిధంగా నుదుటిన బొట్టు పెట్టుకోవడం హిందూ సంప్రదాయం. బొట్టు లేని ఆడపిల్లను పొద్దునే చూడకూడదు. ఆడవారు ఉదయం లేవగానే సరాసరి కిచెన్ లోకి వెళ్లి పనులు స్టార్ట్ చేస్తుంటారు. కానీ ఉదయం లేవగానే అపరిశుభ్రంగా ఉన్న పాత్రలు చూడకూడదట. చాలా మంది ఇళ్లలో జంతువుల ఫొటోలు పెట్టుకుంటారు. కానీ పొద్దున్నే క్రూర జంతువుల ఫొటోలు చూడడం లేదంటే జంతువులను చూడడం మంచిది కాద‌ట‌.

which one we have to see which one we not after wake up

ఉదయం లేవగానే మన అరచేతిని మనం చూసుకున్నట్టయితే మనకు లక్ష్మీ ప్రసన్నం కలుగుతుంది. మన చేతిలోనే లక్ష్మిదేవిని పెట్టాడు పరమేశ్వరుడు. నిద్రలేవగానే భూ దేవతకు నమస్కారం చేయాలి. ఎందుకంటే మనం చేసే పాపాలను ఆ తల్లి భరిస్తుంది. ముందుగా ఆమెకు నమస్కరించి భూమి మీద కాలు పెట్టాలి. ఈ విధంగా పెట్టి ప్రతి రోజు మన దినచర్యను ప్రారంభిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. వీటితో పాటుగా ఉదయం నిద్ర లేవగానే బంగారం, సూర్యుడు, ఎర్రచందనం, సముద్రం, గోపురం, పర్వతం, దూడతో ఉన్న ఆవు, కుడి చేయి, మగవారు తమ భార్య‌ను చూడడం మంచిది. దీంతో రోజంతా శుభ‌మే జ‌రుగుతుంది. అనుకున్న‌వి జ‌రుగుతాయి. ఎలాంటి న‌ష్టాలు రాకుండా ఉంటాయి.

Admin

Recent Posts