ఆధ్యాత్మికం

ప్ర‌యాణానికి అనుకూలంగా ఉండే వారాలు, తిథులు ఏమిటో తెలుసా..?

ప్రతి ఒక్కరు జీవితంలో నిత్యం ఎటో అటు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అయితే వీటిలో వృత్తి కోసం నిత్యం అంటే ఉద్యోగం కోసం చేసే వాటికి ఎటువంటి మంచి చెడులూ చూడనక్కర్లేదు. అయితే ముఖ్యమైన పనులు, యాత్రలు చేయడానకి తప్పక మంచిచెడూ చూసుకుని పోవాలని శాస్త్రాలు చెప్తున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం. ముఖ్యంగా దీర్ఘకాల ప్రయాణాలకు తీర్థయాత్రలు చేయటానికి అనువైన ముహూర్తాలను నిర్ణయించుకుని బయలుదేరటం మంచిది. సుదూర ప్రయాణాలకు సోమ, బుధ, గురు, శుక్రవారాలు శుభప్రదం. విదియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి ప్రయాణానికి శుభ తిథులుగా పరిగణించాలి.

అలాగే శుక్ర, ఆది వారాలు పశ్చిమ దిశ ప్రయాణం మంచిది కాదు. గురువారం దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయరాదు. భరణి, కృత్తిక, ఆర్థ్ర, ఆశ్లేష, పుబ్బ, విశాఖ, పూర్వాషాఢ, పూర్వభాద్ర నక్షత్రాల రోజు ప్రయాణమే పెట్టుకోరాదు. విదియ, తదియ- కార్యసిద్ధి, పంచమి – శుభం. సప్తమి -సంతృప్తి, దశమిరోజు – ధనలాభం, ఏకాదశి – లాభం, త్రయోదశి- శుభం, శుక్ల పాడ్యమి- దుఃఖం, చవితి- ఆపదలు, షష్ఠీ – అకాల వైరాలు, అష్టమి- అష్టకష్టాలు, నవమి- నష్టం, ద్వాదశి నాడు ఇబ్బందులు, బహుళ చతుర్ధీ – చెడును కలిగిస్తుంది..

which thithi and days are positive for journey

శుక్ల చతుర్దశినాడు ఏ పని కాదు. ఇక మేషం, మిధునం, కర్కాటకం, కన్య, తుల, ధనుస్సు, మకరం, మీనం వంటి శుభ లగ్నాలలో ప్రయాణం చేపట్టడం మంచింది. ముఖ్యంగా సోమవారం తూర్పు దిశగా ప్రయాణాలు చేయకూడదు.ప్రయాణ ముహూర్తాలకు ఆది, మంగళ, శనివారాలు పాడ్యమి, పంచ పర్వాలు, ద్వాదశి, షష్ఠి, అష్టమీలలో ప్రయాణాలు చేయకూడదు. అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, అనూరాధ, శ్రవణం, ధనిష్ఠ, రేవతి శుభ నక్షత్రాలుగా పరిగణిస్తున్నారు.అందువల్ల ఈ నక్షత్ర కాలంలో ప్రయాణాలు ఆరంభించడం మంచిది. పౌర్ణమి, అమావాస్య నాడు ప్రయాణాలు అంత మంచిది కాదు. శాస్త్రం,పెద్దలు చెప్పిన మాటలు వింటే మంచి జరుగుతుంది. ఎంత సాంకేతిక పెరిగినా పెద్దలు చెప్పిన అనుభవ పాఠాలు మన మంచికే అని ఆచరిస్తే మంచిదని పండితుల ఉవాచ.

Admin

Recent Posts