ఆధ్యాత్మికం

తిరుమ‌ల శ్రీ‌వారి హుండీ గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తిరుమల కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి చెందినది&period; ఇక్కడ ప్రతీది విశేషమే&period; అలాంటి వాటిలో కొప్పర గురించి తెలుసుకుందాం… తిరుమల కొప్పెర అంటే మూతి వెడల్పుగా ఉండే లోహపాత్ర అని అర్థం&period; తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీ గబగబా నిండిపోతూ ఉంటుంది కాబట్టి పెద్ద గంగాళంలా ఉండే పాత్రను హుండీగా తెల్లనిగుడ్డ అడుగు భాగంలో ఉంచుతారు&period; ఆ హుండీ పాత్రను కొప్పెర అంటారు&period; తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ కొప్పెరలను హుండీలుగా వాడతారు&period; హుండీ నిండిందని తెలుస్తూనే అక్కడే ఉన్న సిబ్బంది మరొక హుండీని ఏర్పాటు చేస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కొంతమంది వంశపారంపర్యంగా ఈ హుండీల దగ్గర పనిచేయడం&comma; హుండీలు నిండిన వెంటనే వాటిని అలాగే కర్రల సహాయంతో మోసుకొని తిరుపతిలోని హథీరాంజీ మఠానికి తీసుకురావడం జరిగేది&period; పూర్వం తిరుమల ఆలయ నిర్వాహకులైన మహంతులు ఈ మఠంలో హుండీలోని డబ్బును లెక్కించేవారు&period; అలా హుండీల దగ్గర పనిచేసే వాళ్ళని కొప్పెరవాళ్ళని&comma; వాళ్ళు నివశించే పల్లెకు కొప్పెరవాండ్ల పల్లి అనే పేరు వచ్చిందంటారు&period; శ్రీనివాసా మంగాపురం వెళ్ళేదారిలో కొప్పెరవాండ్ల పల్లి ఉంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80858 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;hundi&period;jpg" alt&equals;"tirumala srivari hundi interesting facts " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హుండీలో భక్తులు వేసిన డబ్బును&comma; నగలను వేరు చేసి లెక్కించే దేవస్థానం ఖజానాకు పంపించే తంతును పరకామణి అంటారు&period;ఇది రెండు విడతలుగా జరుగుతుంది&period; రాత్రి హుండీని దేవస్థాన ఉద్యోగులు ఉదయం లెక్కిస్తారు&period; ఉదయం విప్పిన హుండీని మధ్యాహ్నం లెక్కిస్తారు&period; రాత్రి నిద్రించిన హుండీని తోకముల్లె అని అంటారు&period; కొప్పెరలో మనడబ్బే కాదు విదేశీ కరెన్సీ&comma; నాణేలు కూడా భక్తులు వేస్తుంటారు&period; హుండీ ద్వారా వచ్చే పట్టువస్త్రాలను దేవస్థానం వారు తమ పరధిలోని ఆలయాలలో కావలసిన సేవలకు&comma; పండుగలకు ఉపయోగించుకుంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలా ఉపయోగించలేక పోయిన పట్టువస్త్రాలను&comma; నగలను&comma; బంగారు వస్తువులను&comma; వజ్రాలు పొదిగిన ఆభరణాలను&comma; వెండి వస్తువులను వేలం వేస్తారు లేకపోతే విలువైన&comma; నాణ్యమైన వాటిని శ్రీవారి ఖజానాలో భద్రపరుస్తారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts