ఆధ్యాత్మికం

దైవానికి ఏయే నైవేద్యాలను సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా ?

సాధారణంగా దేవుళ్లు, దేవతలకు భక్తులు వివిధ రకాల నైవేద్యాలను పెడుతుంటారు. వాటిల్లో వండిన పదార్థాలు ఉంటాయి. పండ్లు ఉంటాయి. అయితే ఏ విధమైన నైవేద్యాన్ని దైవానికి సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటి పండును దైవానికి నైవేద్యంగా సమర్పిస్తే అనుకున్నవి నెరవేరుతాయి. చిన్న అరటి పండ్లను నైవేద్యంగా పెడితే మధ్యలో ఆగిపోయిన పనులు ముందుకు కొనసాగుతాయి. విజయవంతంగా వాటిని పూర్తి చేస్తారు. అరటి పండు గుజ్జును నైవేద్యంగా పెడితే రుణ విముక్తి కలుగుతుంది. చేతికి అందాల్సిన సొమ్ము వస్తుంది. లోన్ల కోసం యత్నించే వారికి డబ్బు చేతికి అందుతుంది. శుభ కార్యాలు పెట్టుకున్న వారికి డబ్బుకు లోటు ఉండదు.

కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా సమర్పిస్తే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఉద్యోగంలో, వ్యాపారంలో రాణిస్తారు. స్నేహితులతో సంబంధాలు మెరుగు పడతాయి. సపోటా పండును నైవేద్యంగా పెడితే వివాహాలు కాని వారికి త్వరగా పెళ్లిళ్లు జరుగుతాయి. కమలా పండును నైవేద్యంగా సమర్పిస్తే సన్నిహితులు సహాయం చేస్తారు.

which type of naivedyam give which result

మామిడి పండ్లను నైవేద్యంగా పెడితే గృహ నిర్మాణంలో ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తుంది. వినాయకుడికి మామిడి పండును సమర్పిస్తే బకాయిలు అనుకున్న సమయంలో వస్తాయి. తేనె, మామిడి పండ్లను కలిపి నైవేద్యంగా సమర్పిస్తే ఇంట్లో అందరికీ మంచి జరుగుతుంది.

అంజీర్‌ పండ్లను నైవేద్యంగా పెడితే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. నేరేడు పండ్లు అయితే శని దోషం పోతుంది. పనస పండును నైవేద్యంగా పెడితే శత్రువులపై విజయం సాధిస్తారు. ద్రాక్ష పండ్లు అయితే ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు. జామ పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పెళ్లికాని యువకులకు పెళ్లి త్వరగా అవుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి.

ఈ విధంగా భిన్న రకాల నైవేద్యాలను దైవాలకు సమర్పించడం వల్ల భిన్న రకాల ఫలితాలను పొందవచ్చు.

Share
Admin

Recent Posts