అధ్య‌య‌నం‌ & ప‌రిశోధ‌న

బాగా డిప్రెష‌న్‌లో ఉంటే ఓదార్పు కోసం ఇలా చేయాల‌ట‌..!

నమ్మండి…నమ్మకపొండి! బ్రిటన్ దేశీయులు ప్రతిరోజూ 13 సార్లు కౌగలించుకుంటారని ఒక సర్వే చెపుతోంది. ఒక్కొక్క కౌగిలిగి 9.5 సెకండ్ల చొప్పున నెలకు సుమారు ఒక గంట కౌగిలింతలతో గడిపేస్తారట. ఇంత శారీరక టచ్ కలిగినా…ఇంకా మరిన్ని కౌగిలింతలకై వారు కోరుతున్నారని కూడా సర్వే తెలుపుతోంది. కౌగలింతకావాలనుకుంటే….69 శాతం ప్రజలు వారి డార్లింగుల వద్దకు, 14 శాతం సన్నిహిత మిత్రులవద్దకు 9 శాతం తమ తల్లుల వద్దకు చేరుతున్నట్లు డైలీ ఎక్స్ ప్రెస్ వెల్లడించింది.

అవకాశం దొరికితే, బ్రిటనీయులు కోరుకునే కౌగిలింతలు ఫుట్ బాలర్ డేవిడ్ బెక్ హాంతోను, హాలీవుడ్ ఫేవరెట్ జార్జ్ క్లూనీ, నటుడు రాబీ విలియమ్స్ తోనని ఆ దేశపు స్కిన్ క్రీమ్ మేకర్ నివియా కంపెనీ నిర్వహించిన రీసెర్చిలో తేలింది. కౌగిలింత వెనుక గల ఉద్దేశ్యం….ఓదార్పు. రోజంతా పనిచేసుకొని ఇంటికి వచ్చిన వారికి హాయినిస్తుంది.

if you are in depression hugging is the best medicine

ఈ ఓదార్పు బ్రిటనీయులకు కౌగిలింతల్లో బాగా దొరుకుతోందట. మహిళలు కొంచెం వేదనకు లోనైతే చాలు, కౌగిలింత కోరతారని కూడా సర్వే చెపుతోంది. అయితే, ప్రతి ఏడుగురిలో ఒకరు మాత్రం పబ్లిక్ స్ధలాలలోను, ఆఫీసులలోను కౌగలింతలు సరికాదని హేండ్ షేకులు, ఒకరిపై ఒకరు కొద్దిగా ఒంగటాలతో సరిపెట్టేసుకుంటున్నారని, వీటి ప్రభావం కూడా ఎంతో కొంత ఓదార్పుగానే వుందని రీసెర్చర్లు వెల్లడించారు.

Admin

Recent Posts