ఆధ్యాత్మికం

గవ్వలు లక్ష్మీదేవి స్వరూపం అని ఎందుకు భావిస్తారో తెలుసా?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం గవ్వలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. సముద్రగర్భం నుంచి బయటపడిన ఈ గవ్వలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొందరు గవ్వలను పూజా సమయంలో ఉపయోగించి పూజలు చేస్తుంటారు. మరికొందరు వివిధ కార్యక్రమాలలో గవ్వలను ఉపయోగిస్తుంటారు. ఈ విధంగా గవ్వలకు ఎందుకంత ప్రాధాన్యత కల్పించారు, గవ్వలను లక్ష్మీ దేవి స్వరూపం అని ఎందుకు భావిస్తారో ఇక్కడ తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు రాక్షసులు సాగర మథనం చేస్తున్న సమయంలో సముద్రగర్భం నుంచి ఎన్నో వస్తువులు ఉద్భవించాయి. ఈ క్రమంలోనే సముద్రగర్భంలో లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదేవిధంగా గవ్వలు కూడా సముద్రగర్భం నుంచి ఏర్పడ్డాయి కనుక గవ్వలను లక్ష్మీదేవి సోదరి సోదరులుగా భావిస్తారు. అందుకోసమే లక్ష్మీదేవి స్వరూపమే గవ్వలని భావిస్తారు.

why gavvalu were called lakshmi devi swaroopam

ఇక గవ్వలను మన ఇంట్లో పెట్టుకుని పూజ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఈ గవ్వలలో కొద్దిగా పసుపు రంగులో ఉండే గవ్వలను మన ఇంట్లో డబ్బులు దాచి చోట ఉంచడం వల్ల మన ఇంట్లోకి ధన ప్రవాహం ఏర్పడుతుంది. అదేవిధంగా కొత్త ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు పసుపుపచ్చని వస్త్రంలో గవ్వలని ఇంటి ద్వారం వద్ద కట్టడంతో ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.అదేవిధంగా పిల్లలకు నరదిష్టి తగలకుండా ఉండాలంటే మెడలో గవ్వను కడతారు. ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్లేటప్పుడు గవ్వలను జేబులో వేసుకుని వెళ్లడం ద్వారా ఆ పని దిగ్విజయంగా జరుగుతుందనీ పండితులు చెబుతారు.ఈ విధంగా గవ్వలను లక్ష్మీదేవి స్వరూపంగా భావించి వాటికి ఎంతో ప్రాధాన్యత కల్పిస్తున్నారు.

Share
Admin

Recent Posts