హెల్త్ టిప్స్

Hemp Seeds : ఇవి మ‌గ‌వారికి, మ‌హిళ‌ల‌కు వ‌రం.. డైలీ ఇన్ని తీసుకుంటే చాలు..!

Hemp Seeds : మ‌హిళ‌ల‌కు స‌హ‌జంగానే నెల‌స‌రి స‌మ‌యంలో అనేక స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ఈ క్ర‌మంలోనే నెలసరికి ముందు వచ్చే కడుపునొప్పి, మూడ్ స్వింగ్స్, నీరసం వంటివి ప్రీ మెన్‌స్ట్రువ‌ల్ సిండ్రోమ్ లక్షణాలుగా చెప్ప‌వ‌చ్చు. నెలసరికి ముందు, మెనోపాజ్ సమయంలో ఉండే లక్షణాలు తగ్గించేవి ఏమైనా ఉన్నాయా అని పరిశోధనలు చేయగా జనపనార విత్తనాలు బాగా సహాయపడతాయని తేలింది. వీటినే హంప్ సీడ్స్ అంటారు. ఇవి ప్రీ మెన్‌స్ట్రువ‌ల్ సిండ్రోమ్ ని కంట్రోల్ చేయడంలో బాగా సహాయపడతాయి. మెనోపాజ్ సమయంలో వచ్చే ఇబ్బందులను కూడా తగ్గిస్తాయి. ప్రీ మెన్‌స్ట్రువ‌ల్ సిండ్రోమ్, మెనోపాజ్ సమయంలో విడుదల అయ్యే హార్మోన్స్ వలన ఈ లక్షణాలు ఉంటాయి. వీటిని హార్మోన్ ఫ్ల‌క్షువేష‌న్స్‌ అంటారు.

ప్రీ మెన్‌స్ట్రువ‌ల్ సిండ్రోమ్ సమయంలో వచ్చే ఇబ్బందులు, మెనోపాజ్ సమయంలో వచ్చే ఇబ్బందులను తగ్గించడంలో జనపనార విత్తనాలు అద్భుతంగా పని చేస్తాయి. జనపనార విత్తనాలలో ఒమెగా 3 ఫాటీ యాసిడ్స్, ఎమినో యాసిడ్స్ అధికంగా ఉంటాయి. జనపనార విత్తనాలు తీసుకోవడం వలన నెలసరి సమయానికి ముందు వచ్చే కడుపు నొప్పి, అలసట, నీరసం, మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. మెనోపాజ్‌లో వచ్చే ఇబ్బందులు కూడా తగ్గుతాయి. శరీరంలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తిని కూడా పెంచుతాయి. మగవారిలో స్పెర్మ్ కౌంట్ పెంచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. పీఎంఎస్‌, మెనోపాజ్ లక్షణాలు రెండూ ఉండే వాపులను నియంత్రించడంలో అవి సహాయపడతాయి.

why hemp seeds are great to men and women

జనపనార గింజలలోని ఒక నిర్దిష్ట యాసిడ్ అయిన గామా-లినోలెనిక్ యాసిడ్ (GLA) ప్రొక్లాటిన్‌ను తగ్గిస్తుందని నిరూపించబడింది. ఇది మహిళల నెలసరి కాలాల్లో సున్నితత్వాన్ని పెంచే హార్మోన్. జనపనార గింజల‌లో GLA అధికంగా ఉన్నందున అనేక అధ్యయనాలు రుతువిరతి లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయని సూచించాయి. క‌చ్చితమైన ప్రక్రియ తెలియదు కానీ జనపనార గింజలలోని GLA రుతువిరతితో సంబంధం ఉన్న హార్మోన్ అసమతుల్యత, వాపుల‌ను నియంత్రిస్తుంది. జనపనార విత్తనాలు ఆన్‌లైన్‌ స్టోర్స్ లో, షాపులలో విరివిగా లభిస్తాయి.

ఈ విత్తనాల‌ను వేయించి పొడి చేసి కూరలలో వేసుకోవచ్చు. లేదా నానబెట్టి పేస్ట్ చేసి కూరలలో వేసుకుని తిన‌వ‌చ్చు. విత్తనాల‌ను దోరగా వేయించి ఖర్జూరం, తేనె కలిపి లడ్డూలు చేసుకుని కూడా తిన‌వ‌చ్చు. వీటిని తినడం వల్ల ప్రీ మెన్‌స్ట్రువ‌ల్ సిండ్రోమ్, మెనోపాజ్ సమస్యల‌ను త‌గ్గించుకోవ‌డ‌మే కాకుండా గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. జనపనార గింజల‌లో మెగ్నిషియం పుష్క‌లంగా ఉంటుంది. ఇది మీ హృదయ స్పందనను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీంతో హైబీపీ త‌గ్గుతుంది. అలాగే గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. ఇక ఇవి లినోలెయిక్ యాసిడ్‌ను కూడా కలిగి ఉంటాయి. ఒక అధ్యయనం ప్రకారం కొలెస్ట్రాల్ స్థాయిలను 15 శాతం తగ్గించి రక్తపోటును తగ్గించడానికి పని చేస్తాయ‌ని తేలింది. క‌నుక వీటిని త‌ర‌చూ తీసుకుంటే ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

Admin

Recent Posts