భారతదేశం అంటేనే అనేక సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు. ఆచార వ్యవహారాలతో పాటు కొన్ని నమ్మకాలను కూడా ఎంతగానో నమ్ముతారు. కానీ ఈ ఆచారాలు పూర్వకాలం నుంచి కొనసాగుతున్నాయి. వీటి వెనుక సైన్స్ కూడా దాగి ఉందని మనం పూర్వపరాలు చూస్తే కానీ అర్థం కాదు. కామన్ గా చాలా మంది ఇంటి గుమ్మానికి నిమ్మకాయ మరియు మిర్చి ఒక దారానికి గుచ్చి కట్టడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా గుమ్మానికి నిమ్మకాయ, మిర్చి కట్టడం వలన నరదృష్టి, ప్రేతాత్మలు పోతాయని భావిస్తూ ఉంటారు.
కానీ నిజానికి అది కాదు. అయితే పూర్వ కాలంలో చాలామంది ఇల్లు మట్టితో కట్టేవారు. దీని వల్ల ఇంట్లోకి చాలా క్రిమికీటకాలు వచ్చేవి. అయితే ఈ క్రిమి కీటకాల నుంచి రక్షణ పొందడానికి నిమ్మకాయలు మరియు మిరపకాయలను సూదితో గుచ్చి కట్టడంవల్ల నిమ్మకాయలో ఉన్నటువంటి సిట్రిక్ యాసిడ్ వాసనకు క్రిమి కీటకాలు ఇంట్లోకి చేరకుండా ఉంటాయి. అందుకే పూర్వకాలంలో పెద్దలు ఇంటి గుమ్మానికి నిమ్మకాయలు, మిరపకాయలను వేలాడతీసేవారు. ప్రస్తుతం ఈ ఆచారాన్ని చాలామంది పాటిస్తూనే ఉన్నారు.
ఈ విధంగా కట్టడం వల్ల ఎలాంటి దృష్టశక్తులు మన ఇంటి వైపు రావు అని భావించి ప్రతి అమావాస్యనాడు ఇవి తీసేసి కొత్తవి కడుతూ ఉంటారు. అలాగే నిమ్మకాయలు మరియు మిరపకాయలతో కలిపిన దండ ఎప్పుడైనా కొత్త వాహనాలు కొనుగోలు చేసినప్పుడు వాటి ముందు భాగంలో కడుతూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం.