ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో శ‌ఠ‌గోపం ఎందుకు పెడ‌తారు..? దీని వెనుక ఉన్న ఆంత‌ర్యం ఏమిటి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">శఠగోపం అంటే అత్యంత గోప్య‌మైనది అని అర్థం&period; శఠగోపంను వెండి&comma; రాగి&comma; కంచుతో తయారు చేస్తారు&period; దాని మీద విష్ణువు పాదాలుంటాయి&period; శఠగోపంను శఠగోప్యం&comma; శఠారి అని కూడా పిలుస్తారు&period; విష్ణుపాదాలు ఉన్న శఠగోపంను తలమీద పెట్టినప్పుడు మన కోరికలు భగవంతుడికి తెలపాలని ఈ శఠగోపం వివరిస్తుంది&period; పూజారికి కూడా వినిపించకుండా మన కోరికలను భగవంతునికి విన్నవించుకోవాలి&period; అంటే మన కోరికే శఠగోపం&period; శఠగోపం మన తలపై పెట్టగానే ఏదో తెలియని అనుభూతి&comma; మానసిక ఉల్లాసం కలుగుతుంది&period; మానవునికి శత్రువులైన కామమూ&comma; క్రోధమూ&comma; లోభమూ&comma; మోహమూ&comma; మదమూ&comma; మాత్సర్యముల వంటి వాటికి ఇక నుంచి దూరంగా ఉంటామని తలూస్తూ తలవంచి శఠగోపం ద్వారా తీసుకోవటమని మరో అర్థం ఉంది&period; శఠగోపమును రాగి&comma; కంచు&comma; వెండిలతో తయారు చేయడం వెనక మరో అంతరార్థం ఉంది&period; శఠగోపం తలమీద ఉంచినప్పుడు శరీరానికి లోహం తగలడం ద్వారా విద్యుదావేశం జరిగి&comma; మనలోని అధిక విద్యుత్‌ బయటకి వెళ్లిపోతుంది&period; దీని ద్వారా శరీరంలో ఆందోళన&comma; ఆవేశం తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శఠగోపం రూపం వెనక మరో అర్థం ఉంది&period; శఠగోపంపై విష్ణుపాదాలు ఉంటాయి&period; అవి పూర్తీగా భక్తుల తలను తాకడానికి అనుకూలంగా ఉండటం కోసం ఇలా వలయాకారంలో తయారు చేస్తారు&period; దీన్ని తలపై పెడితే&period;&period; భగవంతుని స్పర్శ శిరస్సుకి తగిలి&period;&period; భక్తులను అనుగ్రహిస్తారని అర్థం&period; శఠత్వం అంటే మూర్ఖత్వం&comma; గోపం అంటే దాచిపెట్టడం అని అర్థం&period; భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని&comma; అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడని ఆధ్యాత్మికత వేత్తలు వివరిస్తారు&period; శఠగోపం గుడిలోని దేవత&comma; దేవుడి విగ్రహానికి ప్రతీక&period; గుడికి వెళ్లిన భక్తులకు&period;&period; దేవతలను తాకే వీలుండదు కాబట్టి&period;&period; తీర్థప్రసాదాలిచ్చిన తర్వాత ఆలయ పూజారి శఠగోపంను భక్తుల తలపై పెట్టడం ఆనవాయితీగా వస్తోంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90996 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;shathagopam&period;jpg" alt&equals;"why pandit put shathagopam on our head " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శఠగోపంను శఠారి అనిపిస్తారు&period; ఇక్కడ మరో అర్థం చెబుతున్నారు&period; శఠం అంటే మోసగాళ్లు&comma; అరి అంటే శత్రువు&period; అంటే మోసగాళ్లకు శత్రువు అని అర్థం&period; భక్తుల తలపై శఠగోపం పెట్టగా&period;&period; చెడు తలంపులు&comma; ద్రోహం వంటి లక్షణాలు నశించి మంచి ప్రవర్తన అలవడుతుందని అంతరార్థం ఉంది&period; ఇంతకి గొప్ప అర్థం&comma; అంతరార్థం ఉన్న శఠగోపంను ఇకపై ఆలయంలో తప్పకుండా&period;&period; మీ శిరస్సుపై పెట్టించుకుని&comma; ఆ దేవుడి అనుగ్రహ&comma; ఆశీస్సులు పొందండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts