Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home ఆధ్యాత్మికం

ఆల‌యాల్లో శ‌ఠ‌గోపం ఎందుకు పెడ‌తారు..? దీని వెనుక ఉన్న ఆంత‌ర్యం ఏమిటి..?

Admin by Admin
July 8, 2025
in ఆధ్యాత్మికం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

శఠగోపం అంటే అత్యంత గోప్య‌మైనది అని అర్థం. శఠగోపంను వెండి, రాగి, కంచుతో తయారు చేస్తారు. దాని మీద విష్ణువు పాదాలుంటాయి. శఠగోపంను శఠగోప్యం, శఠారి అని కూడా పిలుస్తారు. విష్ణుపాదాలు ఉన్న శఠగోపంను తలమీద పెట్టినప్పుడు మన కోరికలు భగవంతుడికి తెలపాలని ఈ శఠగోపం వివరిస్తుంది. పూజారికి కూడా వినిపించకుండా మన కోరికలను భగవంతునికి విన్నవించుకోవాలి. అంటే మన కోరికే శఠగోపం. శఠగోపం మన తలపై పెట్టగానే ఏదో తెలియని అనుభూతి, మానసిక ఉల్లాసం కలుగుతుంది. మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుంచి దూరంగా ఉంటామని తలూస్తూ తలవంచి శఠగోపం ద్వారా తీసుకోవటమని మరో అర్థం ఉంది. శఠగోపమును రాగి, కంచు, వెండిలతో తయారు చేయడం వెనక మరో అంతరార్థం ఉంది. శఠగోపం తలమీద ఉంచినప్పుడు శరీరానికి లోహం తగలడం ద్వారా విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్‌ బయటకి వెళ్లిపోతుంది. దీని ద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశం తగ్గుతాయి.

శఠగోపం రూపం వెనక మరో అర్థం ఉంది. శఠగోపంపై విష్ణుపాదాలు ఉంటాయి. అవి పూర్తీగా భక్తుల తలను తాకడానికి అనుకూలంగా ఉండటం కోసం ఇలా వలయాకారంలో తయారు చేస్తారు. దీన్ని తలపై పెడితే.. భగవంతుని స్పర్శ శిరస్సుకి తగిలి.. భక్తులను అనుగ్రహిస్తారని అర్థం. శఠత్వం అంటే మూర్ఖత్వం, గోపం అంటే దాచిపెట్టడం అని అర్థం. భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడని ఆధ్యాత్మికత వేత్తలు వివరిస్తారు. శఠగోపం గుడిలోని దేవత, దేవుడి విగ్రహానికి ప్రతీక. గుడికి వెళ్లిన భక్తులకు.. దేవతలను తాకే వీలుండదు కాబట్టి.. తీర్థప్రసాదాలిచ్చిన తర్వాత ఆలయ పూజారి శఠగోపంను భక్తుల తలపై పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

why pandit put shathagopam on our head

శఠగోపంను శఠారి అనిపిస్తారు. ఇక్కడ మరో అర్థం చెబుతున్నారు. శఠం అంటే మోసగాళ్లు, అరి అంటే శత్రువు. అంటే మోసగాళ్లకు శత్రువు అని అర్థం. భక్తుల తలపై శఠగోపం పెట్టగా.. చెడు తలంపులు, ద్రోహం వంటి లక్షణాలు నశించి మంచి ప్రవర్తన అలవడుతుందని అంతరార్థం ఉంది. ఇంతకి గొప్ప అర్థం, అంతరార్థం ఉన్న శఠగోపంను ఇకపై ఆలయంలో తప్పకుండా.. మీ శిరస్సుపై పెట్టించుకుని, ఆ దేవుడి అనుగ్రహ, ఆశీస్సులు పొందండి.

Tags: shathagopam
Previous Post

మీరు చేసే ఈ పనులు చట్టవిరుద్దమని మీకు తెలుసా….

Next Post

ఆంజ‌నేయ స్వామి నుంచి మ‌నం నేర్చుకోద‌గిన గొప్ప ల‌క్ష‌ణాలు ఇవే..!

Related Posts

హెల్త్ టిప్స్

గ‌ర్భిణీలు నిజంగానే ఆహారం అధికంగా తినాలా.. వైద్యులు ఏమంటున్నారు..?

July 8, 2025
హెల్త్ టిప్స్

మైక్రోవేవ్ ఓవెన్ ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ఆహారాల‌ను వండ‌కూడ‌దు.. ఎందుకంటే..?

July 8, 2025
వైద్య విజ్ఞానం

పిల్ల‌ల చెవి ద‌గ్గ‌ర అస‌లు ముద్దు పెట్ట‌కూడ‌దు.. ఎందుకంటే..?

July 8, 2025
ఆధ్యాత్మికం

ఆల‌యంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ త‌ప్పుల‌ను చేయ‌కూడ‌దు.. ఎందుకంటే..?

July 8, 2025
ఆధ్యాత్మికం

ఈ ఆల‌యంలోకి మ‌హిళ‌లు అందుక‌నే వెళ్ల‌కూడ‌దు.. వెళ్తే ఏం జ‌రుగుతుంది అంటే..?

July 8, 2025
ఆధ్యాత్మికం

జామ పండ్ల‌ను నైవేద్యంగా పెడితే ఏం జ‌రుగుతుంది..?

July 8, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు త‌మ పాదాల పట్ల ఈ జాగ్ర‌త్త‌లను తీసుకోవ‌డం త‌ప్ప‌నిసరి..!

by Admin
July 6, 2025

...

Read more
డ్రింక్స్‌

Oats Chocolate Milk Shake : బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు క్ష‌ణాల్లో దీన్ని చేసుకుని తాగండి.. త‌క్ష‌ణ‌మే శ‌క్తి ల‌భిస్తుంది..

by D
October 29, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.