ఆధ్యాత్మికం

మహిళలు కాలిమెట్టలు, చేతులకు గాజులు, చెవి కమ్మలు ఎందుకు ధరించాలి?

భారతీయ సాంప్రదాయలను సరిగ్గా పరీక్షించి చూడాలే కానీ అందులో సైన్స్ దాగుంది. మనవాళ్లు ఆచారం ..ఆచారం అని బలవంతంగా మనపై రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ…ఆచారాల వెనకున్న సైన్స్ ఇది, దీనిని పాటిస్తే ఇలా ఉంటుందని చెబితే ప్రతి ఒక్కరు మన ఆచారాలను సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటించడమే కాదు ఇతరులకు సైతం మన గొప్పతనం గురించి వివరిస్తారు. ఇప్పుడు మన ఆచారాల్లోని మూడు విషయాల గురించి చర్చిద్దాం.

భారతీయ మహిళలు కాలి మెట్టెలు ఎందుకు ధరిస్తారు? భారతదేశంలో వివాహం చేసుకున్న మహిళలు కాలికి మెట్టెలు ధరిస్తారు. కాలి రెండో వేలికి మెట్టెలను ధరిస్తారు. అలా ధరించడం కేవలం అందానికి మాత్రమే కాదు, దాని వెనుక ఒక బలమైన కారణం కూడా ఉంది. కాలి రెండవ వేలు నుండి గర్భాశయం, గుండెకు నిర్దిష్ట నాడులు కలిగి ఉంటాయి. గర్భాశయాన్ని నియంత్రించడానికి ఆరోగ్యంగా ఉండేలా చేయడానికి తోడ్పడుతుంది. రుతుచక్రం సక్రమంగా జరిగేలా చేస్తుంది. మరో విషయం ఎంటంటే వెండినే కాలిమెట్టెగా ధరించడానికి కారణం లేకపోలేదు. ఇది మంచి వాహకంగా పనిచేసి శరీర ఉష్ణోగ్రతను సమతాస్థితిలో ఉంచుతుంది.

why women wear bangles and mettelu

భారతీయ మహిళలు గాజులను ఎందుకు ధరిస్తారు? గాజులను అలంకరణ, ఆభరణ వస్తువులుగా మాత్రమే ఉపయోగించరు. మణికట్టు నుండి ముంజేతికి మధ్య ఉండే నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానమై ఉంటాయి. గర్బాశయ నాడులను ఉద్దీపనం చేయడానికి గాజులను ఉపయోగిస్తారు. మణికట్టు దగ్గరగా ఉండే నాడులు ఒత్తిడికి లోనవుతుంటే , గర్భాశయ నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజితమవుతాయి. దీనివలన గర్బాశయ పనితీరు, కండరాల కదలిక, రక్తప్రసరణ బాగా జరుగుతుంది. సీమంతం అప్పుడు గాజులు తొడగడానికి కారణం…గర్భంలోని పిండం ఎదుగుదలకు గాజుల చప్పుళ్లు ఉపయోగపడతాయట.!

మహిళలు చెవిపోగులు ధరించడం.. మహిళలు ధరించే చెవిపోగులు వారిని అందంగా చూపిండమే కాకుండా వారి తెలివిగల నిర్ణయాలకు కారణాలవుతాయట. . చెవిపోగులు ధరించడం వల్ల ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడుతారట, చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారట.

Admin

Recent Posts