ఆధ్యాత్మికం

Oil To Hair : త‌ల‌కు నూనె రాయ‌కూడ‌ని రోజులు ఇవే..!

Oil To Hair : ప్రతి ఒక్కరూ కూడా అందమైన కురులని కోరుకుంటారు. మంచిగా కురులు ఎదిగితే, అందం కూడా పెరుగుతుంది. తలకి నూనె రాసేటప్పుడు చాలా మంది తెలియక కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. వారంలో అన్ని రోజులు నూనె రాసుకోకూడదు. వారంలో కేవలం కొన్ని రోజులు మాత్రమే నూనె రాసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజుల్లో అసలు నూనె రాసుకోకూడదు. ఆదివారం నూనె రాసుకుంటే అశుభం కలుగుతుంది. ఆదివారం నాడు తలకి అసలు నూనె రాసుకోకండి.

శుక్రవారం నాడు కూడా నూనె రాసుకోకూడదు. శుక్రవారం తలకి నూనె రాసుకుంటే అప్పులు, బాధలు పెరిగిపోతాయి. ఇంట్లో ఖర్చులు కూడా ఎక్కువ అయిపోతాయి. డబ్బులు కూడా విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. కాబట్టి శుక్రవారం నాడు కూడా తలకి నూనె రాసుకోకూడదు. గురువారం నాడు కూడా తలకి నూనె రాసుకోకూడదు. గురువారం గురు గ్రహబలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి గురువారం నాడు తలకి నూనె రాసుకుంటే కష్టాలు ఎక్కువ అవుతాయి.

you should not apply oil to hair in these days

కుటుంబ సమస్యలు పెరిగిపోతాయి. కేవలం ఈ రోజుల్లో మాత్రమే కాకుండా రాత్రి సమయంలోనూ తలకి నూనె రాసుకోకూడదు. రాత్రిపూట నూనె రాసుకుంటే దరిద్రం కలుగుతుంది. అనారోగ్యం కలుగుతుంది. జుట్టు తడిగా ఉన్నప్పుడు నూనె రాసుకోకూడదు. జుట్టు పాడవడం మాత్రమే కాదు, జుట్టుకి తడిగా ఉన్నప్పుడు నూనె రాస్తే ఐశ్వర్యం క్షీణిస్తుంది. మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కుటుంబ కలహాలు కూడా కలుగుతాయి.

శనివారం జుట్టుకి, శరీరానికి నూనె పట్టించి అభ్యంగన స్నానం చేస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయి. పాపాల నుండి విముక్తి లభిస్తుంది. జాతకంలో దోషాలు పోవడానికి నువ్వుల నూనెతో స్నానం చేయడం మంచిది. సాయంత్రం సంధ్యా సమయంలో జుట్టుకి నూనె రాసి ఇంట్లో కూర్చోవడం వలన లక్ష్మీదేవి ఆ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి జుట్టుకి నూనె రాసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అసలు చేయకండి. లేదంటే మీరే అనవసరంగా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. అనేక కష్టాలు కలిగి బాధపడాలి.

Admin

Recent Posts