Acidity : బాగా కారం, మసాలాలు ఉన్న ఆహారాలను ఎక్కువగా తిన్నా.. మద్యం విపరీతంగా సేవించినా.. ఒత్తిడి, ఆందోళన వల్ల.. కొన్ని రకాల మెడిసిన్లను వాడడం వల్ల.. కొందరికి కడుపులో విపరీతమైన గ్యాస్, మంట వస్తాయి. అవి ఒక పట్టాన తగ్గవు. అయితే కింద తెలిపిన ఆయుర్వేద చికిత్సలను పాటిస్తే.. దాంతో ఆయా సమస్యల నుంచి సులభంగా బయట పడవచ్చు. మరి ఆ చికిత్సలు ఏమిటంటే..
1. రోజూ ఉదయాన్నే పరగడుపునే కలబంద రసాన్ని 30 ఎంఎల్ మోతాదులో సేవించాలి. ఈ రసాన్ని తాగిన తరువాత 30 నిమిషాల వరకు ఏమీ తినరాదు. తాగరాదు. ఇలా రోజూ చేస్తుంటే 4 రోజుల్లో గుణం కనిపిస్తుంది. 15 రోజులు ఈ విధంగా తీసుకుంటే అన్ని రకాల జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
2. రోజూ ఉదయాన్నే పరగడుపునే ఉసిరికాయ రసాన్ని 30 ఎంఎల్ మోతాదులో తాగాలి. ఇది కూడా కడుపులో మంట, గ్యాస్‌లను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. కొన్ని రోజుల పాటు క్రమం తప్పకుండా రోజూ తాగితే.. సమస్యల నుంచి బయట పడవచ్చు.
3. లేత కొబ్బరి బొండాంలోని నీళ్లను ఒక గ్లాస్ మోతాదులో ఉదయాన్నే పరగడుపునే తాగాలి. తరువాత 30 నిమిషాలకు అందులోని లేత కొబ్బరి గుజ్జును తినేయాలి. ఇలా చేస్తే రెండు మూడు రోజుల్లోనే సమస్య నుంచి బయట పడవచ్చు.
4. పాలను బాగా మరిగించి చల్లార్చాలి. అవి బాగా చల్లగా అయిన తరువాత చల్లని పాలను రోజూ ఉదయం, సాయంత్రం రెండు సార్లు ఒక కప్పు చొప్పున తాగుతుండాలి. కడుపులో మంట, గ్యాస్ తగ్గిపోతాయి.
5. కడుపులో మంట, గ్యాస్ తగ్గే వరకు తేలిగ్గా జీర్ణం అయ్యే ఆహారాలను తీసుకోవాలి. కారం, మసాలాలు, నూనెలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తినరాదు. పులుపును కూడా మానేయాలి. మద్యం సేవించరాదు. పొగ తాగరాదు. భోజనం చివర్లో ఒక గ్లాస్ మజ్జిగను సేవించాలి. అలాగే భోజనానికి, భోజనానికి మధ్యలో ఒక అరటి పండును తినాలి. ఇది సహజసిద్ధమైన అంటాసిడ్‌లా పనిచేస్తుంది. ఇలా చేస్తుంటే కడుపులో మంట, గ్యాస్ తగ్గిపోతాయి.