Beauty Tips For Men : ముఖం నల్లగా మారుతుందా..? అయితే ఇలా చేయండి.. కేవలం మగవారికి మాత్రమే..!

 Beauty Tips For Men : అందం అంటే ఒకప్పుడు కేవలం మహిళలు మాత్రమే జాగ్రత్తలు పాటించేవారు. కానీ ప్రస్తుత తరుణంలో పురుషులు కూడా అందంగా ఉండేందుకు తాపత్రయ పడుతున్నారు. కానీ నిత్యం బయట తిరుగుతుంటారు కనుక ముఖం నల్లగా మారుతుందని ఆందోళన చెందుతుంటారు. అయితే అలాంటి వారు బాధ పడాల్సిన పనిలేదు. కింద తెలిపిన సహజసిద్ధమైన చిట్కాలను పాటిస్తే.. దాంతో ముఖంలోని నలుపుదనం పోతుంది. తెల్లగా, కాంతివంతంగా మారుతుంది. యవ్వనంగా కనిపిస్తారు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..

 Beauty Tips For Men follow these natural tips to get clean and clear face

1. ముఖాన్ని క్లీన్‌ చేయడంలో తేనె, నిమ్మరసం మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి మిక్స్‌ చేసి దాన్ని ముఖానికి రాయాలి. 10 నిమిషాలు ఆగాక కడిగేయాలి. రోజూ ఇలా రెండు సార్లు చేయాలి. దీంతో ముఖంపై ఉండే దుమ్ము, ధూళి, మృత కణాలు పోతాయి. ముఖం శుభ్రంగా మారుతుంది. కాంతివంతమవుతుంది. రోజూ పాటిస్తే ముఖంలోని నల్లదనం పోతుంది. ముఖం తెల్లగా, అందంగా కనిపిస్తుంది.

 

2. పైనాపిల్‌ ను ముక్కలుగా కోసి ఒకటి రెండు ముక్కలతో ముఖంపై బాగా రుద్దాలి. దీని వల్ల కూడా ముఖంపై ఉండే దుమ్ము, ధూళి పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. రోజుకు ఇలా ఒకసారి చేయవచ్చు.

3. ఒక టీస్పూన్‌ తేనె, ఒక టీస్పూన్‌ కాఫీ పొడి, కొన్ని చుక్కల ఆలివ్‌ ఆయిల్‌ కలిపి ముఖంపై అప్లై చేయాలి. కొన్ని నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారంలో 3 సార్లు చేయాలి. దీంతో ముఖం మెరిసిపోతుంది.

4. వేపాకులను పేస్ట్‌లా చేసి అందులో చందనం పొడి, బాదంపప్పు పొడి, పసుపు పొడి వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసి 20 నిమిషాల పాటు ఉంచాలి. తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖంలోని నలుపుదనం పోయి తెల్లగా మారుతుంది. ఇది ఇన్‌ స్టంట్‌ రిజల్ట్‌ను ఇస్తుంది. కనుక వారంలో 2 సార్లు ఇలా చేస్తే చాలు. అయితే పసుపు, చందనంలను పురుషులు రాసుకోవచ్చా ? అనే ప్రశ్న తలెత్తుతుంది. కానీ నిర్భయంగా ఈ మిశ్రమాన్ని వాడవచ్చు. ఎలాంటి సందేహాలు అవసరం లేదు.

5. చర్మాన్ని క్లీన్‌ చేయడంలో ఆరెంజ్‌ జ్యూస్‌ బాగా పనిచేస్తుంది. ఇందులోని విటమిన్‌ సి చర్మానికి మెరుపును ఇస్తుంది. రెండు టేబుల్‌ స్పూన్ల ఆరెంజ్‌ జ్యూస్‌ను తీసుకుని అందులో కొద్దిగా పసుపు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఆ ప్యాక్‌ను ముఖానికి రాసి 20 నిమిషాల పాటు ఉండాలి. అనంతరం సాధారణ నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.

6. బొప్పాయి పండును పేస్ట్‌లా చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. 20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారంలో 3 సార్లు చేయాలి. దీని వల్ల బొప్పాయిలోని ఎంజైమ్స్‌ చర్మాన్ని శుభ్రం చేస్తాయి. ముఖంలోని నలుపుదనం పోయి అందంగా మారుతుంది.

7. మార్కెట్‌లో మనకు విటమిన్‌ ఇ క్యాప్సూల్స్‌ లభిస్తాయి. వాటిని కొనుగోలు చేసి తెచ్చి వాటిల్లోని ఆయిల్‌ను బయటకు తీయాలి. దాన్ని ముఖంపై అప్లై చేయాలి. గంట సేపటి తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో రెండు సార్లు ఇలా చేయాలి. దీంతో కూడా ముఖంలో కాంతి పెరుగుతుంది.

Share
Editor

Recent Posts