వినోదం

చిరంజీవి చేతిలో ఉన్న ఈ పిల్లాడు ఇప్పుడు టాలీవుడ్ హీరో.. ఎవ‌రో గుర్తు ప‌ట్టండి..!

సోష‌ల్ మీడియాలో సెల‌బ్రిటీల‌కి సంబంధించిన పిక్స్ తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఈ క్ర‌మంలో తాజాగా చిరంజీవి ఓ చిన్నారిని ఎత్తుకున్న పిక్ నెట్టింట హ‌ల్‌చల్ చేస్తుంది. ఈ పిక్ చూసిన వారు అత‌డు మెగా ఫ్యామిలీకి సంబంధించిన వారు అని అనుకుంటారు. కాని అత‌డు ప్ర‌ముఖ న‌టుడు, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ త‌న‌యుడు ఆది సాయి కుమార్. వారసత్వ హీరోగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఆది సాయి కుమార్ .. అటు నిర్మాతలను, ఇటు ప్రేక్షకులను మెప్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రేమ కావాలి సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆది తనకంటూ నటుడిగా ఓ ప్రత్యేక ముద్రను వేశారు.

ఆది నటుడిగా కెరీర్‌ను మొదలుపెట్టి పన్నెండేళ్లకి పైనే ఉంది. అయితే ఆయ‌న కెరీర్‌లో స‌క్సెస్‌లు క‌న్నా ఫ్లాప్స్ ఎక్కువ ఉన్నాయి. ఫలితంతో సంబంధం లేకుండా తన అభిమానులను అలరించేందుకు విభిన్న జానర్లను ప్రయత్నిస్తూనే వచ్చారు. ఆయన కెరీర్‌లో ప్రేమ కావాలి, లవ్‌లీ, సుకుమారుడు, శమంతకమణి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, బుర్రకథ, శశి ఇలా అనేక రకాల కాన్సెప్టులతో సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.ఇప్పటి వరకు దాదాపు 15 సినిమాలు చేసిన ఆది సాయికుమార్.. అందులో ఏ ఒక్కదానితో కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్ద హిట్ కొట్టింది లేదు.

adi sai kumar childhood photo viral

యూ ట్యూబ్ లో ఆది సాయికుమార్ హిందీ డబ్బింగ్ సినిమాలకు అదిరిపోయే డిమాండ్ ఉంది. అతడి సినిమాలకు వందల మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఈ క్ర‌మంలో సినిమా మీద నిర్మాతలు పెట్టిన బడ్జెట్ విడుదలకు ముందే వర్కౌట్ అవుతుంది. అందుకే ఆయ‌న‌తో సినిమాలు చేసేందుకు నిర్మాత‌లు ముందుకు వ‌స్తున్న‌ట్టు తెలుస్తుంది .థియేటర్స్ లో పెద్దగా వర్కౌట్ అవ్వకపోయినా.. శాటిలైట్, ఓటిటి, డిజిటల్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో నిర్మాతలు బయటపడిపోతున్నారు. మిగిలిన ఏ హీరోలకు లేని అడ్వాంటేజ్ ఆదికి ఉంది కాబట్టే అత‌ను వరుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడు.

Admin