వినోదం

బన్నీ భార్య స్నేహకి, అల్లు అరవింద్ భార్య పెట్టిన కండిషన్స్ ఇవ్వే !

టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది రొమాంటిక్ కపుల్స్ లో ఒకరు అల్లు అర్జున్, స్నేహారెడ్డి. ఈ జంటను చూసిన ఎవరైనా సరే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనాల్సిందే. అంత చూడ చక్కనైన జంట. ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా, ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట. భార్యాభర్తలు ఆన్న తర్వాత సహజంగానే చిన్న చిన్న గొడవలు పడుతుంటారు. కానీ, ఈ జంటను చూస్తే అసలు వీళ్ళు గొడవ పడరా, ఎప్పుడు ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు అనుకుంటారు అందరూ.

10 ఏళ్ల‌కు పైగా వీరి దాంపత్య జీవితం ఎంతో హ్యాపీగా అన్యోన్యంగా కొనసాగుతుంది. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ అండదండలతో హీరోగా వచ్చి తనకంటూ ఓ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే స్నేహకి అల్లు అరవింద్ భార్య పెళ్లికి ముందు ఒక కండిషన్ పెట్టిందట. ఆ కండిషన్ స్నేహ యాక్సెప్ట్ చేయగానే ఆమె పెళ్లికి ఓకే చేసినట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది.

allu arjun mother put this condition to his wife sneha reddy

జనరల్ గా ప్రతి అత్తకి ఉండే కోరిక పెళ్లయిన తర్వాత తన కొడుకుని హ్యాపీగా చూసుకోవాలి, పిల్లల్ని కనాలి. ఇదే కండిషన్ పెట్టిందట స్నేహ కి అల్లు అరవింద్ భార్య. స్నేహ మొదటి నుంచి గ్లామరస్ గా ఉంటుంది. స్టార్ హీరోయిన్లను మించిపోయే అందం ఉంది స్నేహ రెడ్డికి. దీంతో మొదటి నుంచి చలాకి అయిన స్నేహా ని చూసి బన్నీ వాళ్ళ అమ్మ పెళ్లి చేసుకున్నాక పిల్లలు కనడానికి టైం ఎక్కువ తీసుకుంటారు ఏమో అంటూ భయపడిందట. ఇదే విషయం చెబుతూ పెళ్లి అయ్యాక పిల్లలు త్వరగా కనాలి. మా చేతుల్లో మనవడిని, మనవరాలను పెట్టాలి అంటూ సరదాగా ఆటపట్టిస్తూ చెప్పుకొచ్చారట. ఇక దాన్ని నిజం చేస్తూ బన్నీ భార్య అత్త కోరిక నెరవేర్చేసింది. మొదట ఒక కొడుకును ఆ తర్వాత ఓ మహాలక్ష్మిని కనేసి అత్త చేతిలో పెట్టేసింది. దీంతో అరవింద్ భార్య ఫుల్ హ్యాపీ, అత్త కోరికను తీర్చిన కోడలుగా బన్నీ భార్య హ్యాపీ, దీంతో ఈ ఫ్యామిలీ మొత్తం హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు.

Admin

Recent Posts