వినోదం

Artist Ravi Prakash : క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవిప్రకాష్ గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Artist Ravi Prakash &colon; డాక్టర్ కాబోయే యాక్టర్లమయ్యామని సినీ ఇండస్ట్రీలో చాలామంది నటులు అంటుంటారు&period; ఈ కోవకు చెందిన సినీ ఆర్టిస్టులు ఎంతోమంది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు&period; ఇక అదే కోవకి చెందిన వారిలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ రవి ప్రకాష్ కూడా ఒకరు&period; తెలుగు&comma; తమిళ&comma; కన్నడ భాషల్లో సుమారు 200 కి పైగా చిత్రాల్లో నటించాడు&period; ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన శుభవేళ అనే చిత్రంలో కథానాయకుడిగా తన నట ప్రస్థానాన్ని ప్రారంభించాడు&period; మొదటి సినిమా తనకు ఆశించిన మేరకు సక్సెస్ సాధించకపోయినా&comma; క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం మంచి గుర్తింపు సంపాదించుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎక్కువగా సహాయ పాత్రల్లో నటించాడు&period; ముఖ్యంగా రవిప్రకాష్ ఘర్షణ&comma; అతడు&comma; వేదం సినిమాల్లో పోషించిన పోలీసు ఆఫీసరు పాత్రలతో ప్రేక్షకులకు చేరువయ్యాడు&period; తమిళంలో వానం&comma; పయనం&comma; మాట్రాన్ లాంటి సినిమాల్లో నటించాడు&period; అయితే ఒక ఇంటర్వ్యూ ద్వారా రవి ప్రకాష్ తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57024 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;ravi-prakash&period;jpg" alt&equals;"Artist Ravi Prakash interesting facts " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నేను విశాఖలో పుట్టి పెరిగాను&period; లాసెన్స్‌బే కాలనీలో మా తల్లిదండ్రులు ఉంటున్నారని ఆయన తెలిపారు&period; విద్యాభ్యాసం అంతా విశాఖలోనే జరిగింది&period; విశాఖ వేలీ స్కూల్‌లో ఇంటర్మీడియట్ వరకు చదివానని&comma; ఆ తర్వాత ఎంబీబీఎస్‌ మాస్కోలో చేశానని రవి ప్రకాష్ తెలిపారు&period; కొంతకాలం పాటు హైదరాబాద్‌లో డాక్టర్ ప్రాక్టిస్‌ చేశాను&period; ఆ తర్వాత స్నేహితులు&comma; బంధువులు ప్రోత్సాహంతో అనుకోకుండానే సినీ రంగ ప్రవేశం చేశాను&period; 2000 సంవత్సరంలో తేజ దర్శకత్వంలో వచ్చిన శుభవేళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యానని రవి ప్రకాష్ వెల్లడించారు&period; అయితే క్రిష్‌ దర్శకత్వంలో వచ్చిన వేదం చిత్రంతో తనకు నటుడిగా మంచి పేరు తెచ్చిందని&comma; అలా డాక్టర్ గా స్థిరపడాలనుకున్న నేను యాక్టర్ గా స్థిరపడ్డానని రవి ప్రకాష్ ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts