వినోదం

Balakrishna : బాల‌య్య త‌న సినీ కెరీర్‌లో వ‌దులుకున్న 10 బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సినిమాలు ఇవే..!

Balakrishna : నంద‌మూరి బాల‌కృష్ణ‌ను ఆయ‌న ఫ్యాన్స్ బాల‌య్య అని పిలుచుకుంటార‌న్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న‌పై ఉన్న అభిమానంతో వారు ఆయ‌న‌ను అలా పిలుచుకుంటారు. అయితే ఫ్యాన్స్‌ను మాత్ర‌మే కాదు.. ఆయ‌న త‌న సినిమాల‌తో అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంటారు. ఆయ‌న ఈ మ‌ధ్య కాలంలో చేసిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. ఇక అఖండ మూవీతో ఆయ‌న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. క‌రోనా త‌రువాత వ‌చ్చిన చిత్రం అయిన‌ప్ప‌టికీ అఖండ‌కు ప్రేక్ష‌కులు బ్రహ్మ‌ర‌థం ప‌ట్టారు. ఇక త్వ‌ర‌లోనే దీనికి రెండో పార్ట్‌ను కూడా తీయాల‌ని ద‌ర్శ‌కుడు బోయ‌పాటి ప్లాన్ చేస్తున్నారు.

బాల‌కృష్ణ త‌న సినిమా కెరీర్‌లో ఎన్నో ర‌కాల చిత్రాల్లో న‌టించారు. పౌరాణిక‌, జాన‌ప‌ద‌, సాంఘిక చిత్రాల్లో ఆయ‌న యాక్ట్ చేశారు. కానీ కొన్ని ఇత‌ర హీరోల సినిమాలు కూడా ముందుగా ఆయ‌న వ‌ద్ద‌కే వ‌చ్చాయి. వాస్త‌వానికి ఆయ‌న వాటిని చేయాల్సి ఉంది. కానీ కొన్ని కార‌ణాల వ‌ల్ల ప‌లు సినిమాల‌ను ఆయ‌న రిజెక్ట్ చేశారు. అయితే వాటిల్లో ఇత‌ర హీరోలు చేశారు. దీంతో అవి హిట్ అయ్యాయి. ఇక బాల‌కృష్ణ త‌న సినీ కెరీర్‌లో వ‌దులుకున్న సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

balakrishna rejected these super hit movies

అప్ప‌ట్లో విక్ట‌రీ వెంక‌టేష్ న‌టించిన చంటి చిత్రం ఎంత‌టి హిట్ ను సాధించిందో అంద‌రికీ తెలిసిందే. అయితే ఈ మూవీని బాల‌కృష్ణతో చేయాల‌నుకున్నార‌ట‌. కానీ క‌థ న‌చ్చ‌క ఆయ‌న దీన్ని రిజెక్ట్ చేశారు. త‌రువాత రాజ‌శేఖ‌ర్ సింహ రాశి మూవీ, వెంక‌టేష్ సూర్య వంశం, జ‌గ‌ప‌తిబాబు శివ‌రామ‌రాజు, ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్న‌వ‌రం సినిమాల్లోనూ బాల‌య్య న‌టించాల్సి ఉంది. కానీ వాటిని కూడా ఆయ‌న ప‌లు కార‌ణాల‌తో రిజెక్ట్ చేశారు.

ఇక అప్ప‌ట్లో నాగార్జున హీరోగా వ‌చ్చిన జాన‌కి రాముడు మూవీని ముందుగా బాల‌య్య‌నే చేయాల్సి ఉంది. కానీ ఆయ‌న చేయ‌లేక‌పోయారు. అలాగే ఆ మ‌ధ్య‌కాలంలో వ‌చ్చిన వెంక‌టేష్ బాడీగార్డ్ మూవీ, సైరా, గ‌తంలో ఎన్‌టీఆర్ న‌టించిన సింహాద్రి, ర‌వితేజ కిక్ మూవీల‌ను కూడా బాల‌కృష్ణ‌నే ముందుగా చేయాల‌ని అనుకున్నార‌ట‌. కానీ ఆ మూవీల‌ను చేయ‌లేక‌పోయారు. అయితే వీటిల్లో దాదాపు అన్నీ హిట్టే అయ్యాయి. అదే గ‌నుక ఆ మూవీల‌ను బాల‌య్య చేసి ఉంటే.. ఆయన ఖాతాలో ఇంకొన్ని హిట్ సినిమాలు వ‌చ్చి ఉండేవి. దీంతో బాల‌య్య ఇంకాస్త పై మెట్టులో ఉండేవారు.

Admin

Recent Posts