ప్రముఖ రేడియాలజిస్టు, నిమ్స్ ఆసుపత్రి స్థాపనలో కీలక పాత్ర పోషించిన వైద్యుడు కాకర్ల సుబ్బారావు గతంలోనే కన్నుమూశారు. వైద్యరంగంలో కాకర్ల సుబ్బారావు ఎనలేని సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ లో వైద్య విద్య ఉన్నత ప్రమాణాల్లో నిలపడంలో సుబ్బారావు ఎవరు సాటి లేరనీ చెప్పవచ్చు. ఈ సందర్భంగా కాకర్ల సుబ్బారావు ఒకప్పుడు ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మరణానంతరం యూట్యూబ్ లో ఈ వీడియోను మరోసారి అప్లోడ్ చేయడంతో ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆ ఇంటర్వ్యూ ద్వారా ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను సుబ్బారావు తెలియజేశారు. ముఖ్యంగా బాలకృష్ణ, బెల్లంకొండ సురేష్ మధ్య జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన విషయాలను ఏమాత్రం దాపరికం లేకుండా కాకర్ల సుబ్బారావు తెలియజేశారు.
ఆ రోజు ఆ సంఘటనలో బాలకృష్ణ కాల్పులు జరప కాకపోయి ఉంటే తుపాకీతో తనని తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకునేవాడని కాకర్ల సుబ్బారావు బాలకృష్ణ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ నా మనసులో ఏదో విధంగా తనని కాపాడాలని ఉంది. అందువల్ల ఇద్దరు అనుభవం ఉన్న సైకియాట్రిస్ట్ లను పిలిపించి చూడమనగా.. అతను ఆ విధంగా చేసి ఉండకపోతే తనని తాను కాల్చుకునే వాడని, అందుకోసమే ఆ టైంలో ఇలా చేయాల్సి వచ్చిందని కాకర్ల సుబ్బారావు చెప్పిన వీడియో యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది.