వినోదం

Chinnadana O Chinnadana Song : 90ల‌లో అంద‌రినీ ఒక ఊపు ఊపిన పాట ఇది.. మీకు గుర్తుందా..?

Chinnadana O Chinnadana Song : చిన్నదాన ఓసి చిన్నదానా ఆశ పెట్టేసిపోమాకె కుర్రదానా .. కళ్ళు అందలకళ్ళు కవ్వించేనె కన్నెవళ్ళు చిన్నార ఈలులోనచిక్కాయిలే చీనీ పల్లు అంటూ సాగే ఈ పాట ఒక‌ప్పుడు కుర్ర‌కారుని పిచ్చెక్కించింది. ‘ప్రేమలేఖ’ సినిమాలోని ‘చిన్నదాన ఓసి చిన్నదాన’ అంటూ సాగే పాటలో ఆమె అందాలకు ఫిదా కాని ప్రేక్షకులుండరు. నాగవల్లి, నిప్పు, రచ్చ, మేం వయసుకు వచ్చాం, బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి, దువ్వాడ జగన్నాథమ్ వంటి చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ర‌క్ష‌. ఈ పాట ఇప్ప‌టికీ చాలా మందికి తెగ న‌చ్చేస్తుంది. ఇందులోని లిరిక్స్‌తో పాటు కొరియోగ్ర‌ఫీ కూడా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా ఉంటాయి.

ఇప్ప‌టికీ ఈ సాంగ్ సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తూ ఉంటుంది. అయితే ర‌క్ష ఇటీవ‌ల ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదురైన ఓ సంఘటన గురించి వివరించింది. 1990ల్లో సినిమాలను ఫాలో అయ్యేవారికి రక్ష సుపరిచితురాలే. హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఐటమ్ సాంగ్స్ ఇలా అనేక రకాలుగా అభిమానులను అలరించారామె. ముఖ్యంగా ‘ప్రేమలేఖ’ సినిమాలోని ‘చిన్నదాన ఓసి చిన్నదాన’ అంటూ సాగే పాటలో ఆమె అందాలకు ఫిదా కాని ప్రేక్షకులుండరు. నాగవల్లి, నిప్పు, రచ్చ, మేం వయసుకు వచ్చాం, బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి, దువ్వాడ జగన్నాథమ్ వంటి చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తన జీవితంలో ఎదురైన ఓ సంఘటన గురించి వివరించింది.

Chinnadana O Chinnadana Song do you remember it

ఓ డైరెక్టర్ మంచి సినిమా అని చెప్పి..తరువాత నా చేత పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేయించి .. బోల్డ్‌గా నటించాలని ఒత్తడి చేశాడని రక్ష చెప్పుకొచ్చింది. ఇలాంటి సీన్లు తాను చేయనని చెప్పానని.. అయినప్పటికీ ఇబ్బంది పెడుతుండటంతో ఆ దర్శకుడు చెంప చెళ్లుమనిపించి ఏంట్రా..? నా గురించి అసలు ఏమనుకుంటున్నావ్‌ ? అంటూ ఈ సినిమాను వదిలేసి బయటకు వచ్చేశానని రక్ష తెలిపారు. అయితే ఆ డైరెక్టర్ పేరు చెప్పడానికి మాత్రం రక్ష ఇష్టపడలేదు. అయితే ఇప్ప‌టికీ చిత్రంలోని పాట మాత్రం ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూనే ఉంటుంది.

Admin

Recent Posts