కత్రినా కైఫ్ కున్న అద్భుత అంగసౌష్టవం వెనుక గల రహస్యం ఆరోగ్యవంతమైన ఆహారంతో ఆరోగ్యవంతమైన మైండ్ కలిగి వుండటం గా చెపుతున్నారు. రెగ్యులర్ యోగా, వ్యాయామాలతో ఈమె తన అంగసౌష్టవాన్ని సాధించింది. తీస్ మార్ ఖాన్ షూటింగ్ కు గాను కత్రినా కఠినమైన ఆహార ప్రణాళికను ఆచరించింది. నేడు బాలీవుడ్ లో కత్రినా ఆచరించిన ఆహార ప్రణాళికే చాలామంది ఫాలో అవుతున్నట్లు చెపుతారు. ఇంత అందమైన కత్రినా బాడీ వెనుక గల రహస్యాన్ని ఆమె వ్యాయామాల గురు ప్రదీప్ భాటియా బయటపెట్టాడు.
అజబ్ ప్రేమ్ కి ఘజబ్ కహాని, రాజనీతి మొదలగు సినిమాలలో కత్రినా నటిస్తున్నపుడు ఆమె శారీరక సౌష్టవం కొరకుగాను ప్రదీప్ భాటియా ఆమెకు చక్కని శిక్షణనిచ్చాడు. కత్రినా వారానికి మూడు రోజులు వ్యాయామం చేస్తుంది. చేసే వ్యాయామాల్లో పొట్టకు ఇతర ప్రధాన అవయవాలకు ప్రాధాన్యతనిస్తుంది. జిమ్మింగ్, స్విమ్మింగ్, యోగా, జోగింగ్ మొదలైనవి కూడా చేస్తుంది. షీలాకి జవాని ఐటమ్ సాంగ్ షూటింగ్ లో బరువు తగ్గటానికి ఆమె సలహాదారు యాస్మన్ కరాచివాలా ఎంతో కృషి చేశాడు.
ఆకలి అయినపుడు ఆమె ఆహారం ఉడికించిన కూరలు, పండ్లు మాత్రమే. కత్రినా ఉదయం 4 గ్లాసుల నీరు తాగుతుంది. ఎగ్ వైట్ లేదా పీనట్ బటర్ తో బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటుంది. లంచ్ లో చేప, గ్రీన్ సలాడ్, బ్రౌన్ రైస్, తింటుంది. కొవ్వు వుంటుందని చికెన్ తినటం మానేసింది. ఆమె తినే ఆహార పదార్ధాలలో అధికంగా కార్బో హైడ్రేట్లు, పీచువుండేట్లు ఎంపిక చేసుకుని శరీరం ఎల్లపుడూ చురుకుగాను, చిన్నదిగాను వుండేలా జాగ్రత్తపడుతుంది.