వినోదం

ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సుమ, ఆ విషయంలో రోజు బాధ పడుతుందట!

టాలీవుడ్ లో అగ్ర యాంకర్ సుమ. సుమ అంటే తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరు. అంత పాపులర్ సుమ. టీవీ తెరపై ఆమె ఓ మెగాస్టార్. ఎంత పెద్ద షో అయినా ఏ మాత్రం బెదరకుండా తన మాటలతో రంజింపచేస్తూ ఆకట్టుకుంటారు. సుమ జన్మతః మలయాళీ అయినా తెలుగింటి కోడలై, మాటలతో మైమరపిస్తున్నారు యాంకర్ సుమ.

సినిమాల్లో చిరంజీవి తన డాన్సులతో, నటనతో, తనదైన మేనరిజంతో ఎంత పేరు తెచ్చుకున్నాడో, టీవీల్లో కూడా సుమ తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ అప్పటికప్పుడు సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ అంత పేరు తెచ్చుకున్నారు. అయితే సుమ అత్తగారు, మామగారు కన్నుమూసిన విషయం తెలిసిందే. సుమకి వాళ్ళ అత్తగారు అంటే చాలా ఇష్టం.

do you know anchor suma still feels sad in that issue

తన అమ్మ తర్వాత అమ్మలాగా భావించిన ఆమె లేకపోవడంతో సుమ ఇప్పటికీ బాధపడుతూనే ఉంటుందట. తాను ఎన్ని ఫంక్షన్, ఎన్ని షోస్ చేసినా ఏ ఈవెంట్స్ కి వెళ్ళిన తన పిల్లల్ని దగ్గర ఉండి తనకన్నా బాగా చూసుకునేద‌ట‌. కానీ ప్రెసెంట్ ఇప్పుడు ఈ పొజిషన్ లేదని ప్రతిరోజు ఇంటికి వెళ్ళగానే ఆమె ఫోటో చూసుకొని బాధపడుతూ ఉంటానని సుమా తన స్నేహితురాలికి చెప్పుకురావడం, ఇప్పుడు ఈ విషయం నెట్టింట హల్ చల్ చేస్తుండడం జరుగుతుంది. ఏదైనా మనవాళ్లు మనతో ఉన్నప్పుడు ఆ వ్యాల్యూ తెలియదు. కోల్పోయినప్పుడే తెలుస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Admin

Recent Posts