ఫ్రెంచి దేశస్ధులకు గుండె జబ్బులు త్వరగా రావని చెపుతారు. వీరు తినే ఆహారంలో కొవ్వు కూడా అధికంగానే వుంటుంది. కాని గుండె జబ్బులు త్వరగా వీరికి రావు. వీరి ఆరోగ్య రహస్యాల పరిశోధనలో, వీరు ప్రతిరోజూ మాడరేట్ గా తాగే వైన్ 40 శాతం వరకు గుండె జబ్బులు రాకుండా సహకరిస్తోందని తేలింది. అంతేకాక, మరో పరిశోధనలో రెడ్ వైన్ తాగేవారి గుండెలు ఆరోగ్యవంతంగా వున్నాయని కూడా వెల్లడైంది. ఇటీవల కొంతమంది ఫ్రెంచి రీసెర్చర్లు చేసిన పరిశోధనలలో ప్రతిరోజు 3.5 నుండి 10 ఔన్సుల రెడ్ వైన్ తాగే వారికి గుండె జబ్బులు దూరం అవటమే కాక, దాని ప్రభావం తో వారిలో బాడీ మాస్ ఇండెక్స్ తగ్గటం, హార్టు రేటు, ట్రిగ్లీసెరైడ్స్, బ్లడ్ షుగర్, ఒత్తిడి, డిప్రెషన్, శ్వాస సంబంధిత సమస్యలు కూడా వెనుకబడతాయని తెలిపారు.
రెడ్ వైన్ తాగే మహిళలలో గుండె సంబంధిత వ్యాధులు తక్కువగా వుండటమే కాక నడుము భాగం సన్నపడుతోందని, రక్తపోటు, ట్రిగ్లీసెరైడ్స్, ఎల్ డిఎల్ చెడు కొల్లెస్టరాల్ తక్కువగా వుండి ఆరోగ్య పరంగానేకాక సొసైటీలో మంచి స్ధానం లభిస్తోందట.
వైన్ ప్రభావం ఎలా వున్నప్పటికి, దానిని తాగటం వారికి సొసైటీలో అధిక విలువలనిస్తూ వారిని మరింత ఉన్నతంగా చేయటంతో ఆరోగ్యం బాగుంటుందని కూడా పరిశోధకులు తెలుపుతున్నారు. కనుక మంచి ఆహారాలలో వైన్ కూడా చేర్చేస్తే, మరింత ఆరోగ్యకరం అంటున్నారు వైన్ డ్రింకర్స్.