హెల్త్ టిప్స్

మ‌ధ్యాహ్నం లంచ్ చేసిన త‌రువాత ఆఫీస్‌లో నిద్ర వ‌స్తుందా.. అయితే ఇలా చేయండి..

కార్యాలయాలలో మధ్యాహ్నం వేళ ఆహారం తింటే చాలు నిద్ర ముంచుకు వచ్చేస్తుందంటారు కొందరు. బద్ధకం, మందం అంతేకాదు, పక్కనే వున్న వారు ఆవలింతలు పెడితే అది మీకు కూడా వచ్చేస్తుంది. మరి ఈ ఆఫీస్ లంచ్ ఎందుకంత ఇబ్బంది పెడుతుంది. సరైన ఆహారం తీసుకోడం లేదా? ఇక్కడ సమస్య ఏమంటే, సాధారణంగా మనమంతా బ్రేక్ ఫాస్ట్ వదిలేసి మధ్యాహ్న భోజనం అధికంగా తీసుకుంటాం. ఇది తప్పు. భోజనం తర్వాత పని చేయాలనుకుంటే మీ లంచ్ లైట్ గా వుండాలి. భోజనం తర్వాత బాగా పని చేసేటందుకు, నిద్ర పోకుండా మెళకువగా వుండేందుకు కొన్ని చిట్కాలు చూడండి.

మీరు మధ్యాహ్నం వేళ తినే ఆహారంలో రొట్టెలు, చపాతీలు వంటి తేలికగా వుండే ఆహారాలు తీసుకోండి. అన్నం బరువు కలిగించి నిద్రించేలా చేస్తుంది. బంగాళ దుంపలవంటి పిండి పదార్ధాలను తినకండి. దీనిలో గ్లైసీమిక్ ఇండెక్స్ చాలా అధికం. షుగర్ లెవెల్ కూడా పెంచుతుంది. పాలు, తేనె వంటివి కూడా తీసుకోకండి. అవి నిద్రను కలిగిస్తాయి. స్వీట్లు తినవద్దు. తప్పకుంటే అతి తక్కువ తినండి. షుగర్, ఇతర పిండి పదార్ధాలు, పాస్తాలు, పేస్ట్రీలు, పఫ్ లు, వైట్ బ్రెడ్ ఇతర జంక్ ఫుడ్ వంటివి వదలండి. ఇవి మిమ్మల్ని మందంగా వుంచటమే కాక గ్యాస్ కలిగిస్తాయి.

if you are getting sleep in office follow these tips

మధ్యాహ్న భోజనం తక్కువ తినాలంటే, ఉదయం వేళ తినే బ్రేక్ ఫాస్ట్ అధికంగా తినండి. ఏది తిన్నప్పటికి గొంతుదాకా తినవద్దు. పొట్ట కొంత ఖాళీ వుంచితే, జీర్ణ వ్యవస్ధ తేలికగా జరుగుతుంది. ఆరోగ్యకరమైన ఈ చిట్కాలను ఆచరించి మధ్యాహ్న వేళ భోజనం తర్వాత ఆఫీస్ లో కునుకు తీయకండి.

Admin

Recent Posts