Off Beat

ప్రేమించ‌డం తప్పు కాదు, స‌రైన వారిని ప్రేమించ‌క‌పోవ‌డమే త‌ప్పు.!

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రేమ అన్నమాటకు సంబంధించి మనలో చాలా మనోభావం ఉంటుంది&period; దాని గురించి రకరకాల ఊహలు నిర్వచనాలు చేస్తూ ఉంటాం&period; ఒక్కసారి ఇష్టపడిన అమ్మాయి తన ప్రేమను ఒప్పుకుంటే అతడే మహారాజు&period; ప్రేమలో మునిగిపోయిన ప్రేమికులు ఏం చేస్తారో చెప్పడం చాలా కష్టం&period; కొంతమంది చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోతారు&period; మరికొంతమంది ఎవ్వరూ చూడకుండా జాగ్రత్తగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఏదో ఒకటి ఇచ్చుపుచ్చుకుంటూ ఉంటారు&period; అయితే ఇప్పుడు ఓ లవ్ స్టోరీ గురించి తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నా చిన్ననాటి స్నేహితుడతను&comma; తెల్లారడంతోనే మొదలయ్యేవి మా ఆటలు&comma; కలిసి పతంగులేగరేయడం&comma; మామిడి తోటలో దొంగతనాలు చేయడం&comma; మా ఊరి చెరువులో ఈత కొట్టడం&comma; తను ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండాల్సిందే&comma; అలా ఉండేది మా స్నేహం&excl; కాలంతోపాటు మా స్నేహం కూడా పెరిగి ప్రేమగా మారింది&period; అది కాస్త ఇంట్లో తెలిసి మా నాన్న&comma; అన్నయ్య ఇద్దరు కలిసి నన్ను కొట్టారు&period; ఆ దెబ్బలకు నా బొక్కలు విరిగాయి&comma; నోట్లోంచి రక్తం పడింది&period; అయినా అతనిపై నా ప్రేమ ఇంకా పెరిగింది&period; ఇద్దరం కలిసి ఊరు వదిలి పారిపోయాము&period; ఇద్దరం కలిసి ఓ పెద్ద టౌన్ లో చిన్న రూమును అద్దెకు తీసుకుని మా కొత్త జీవితాన్ని ప్రారంభించాము&period; అతను టెక్స్టైల్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు&period; నేను మా ఇంటి ఏరియాలో ఉండే ఇండ్లలో పాచి పని చేసేదానిని&period; చిన్న ఉద్యోగాలు&comma; చిన్న ఇల్లు&comma; కానీ మనసు నిండా బోలెడంత ప్రేమ&period; ఒక్కోసారి ఆయన నైట్ డ్యూటీ కూడా చేసేవారు&period; ఆయన కోసం తెల్లవారే వరకు ఎదురుచూసిన రోజులు అనేకం&comma; అయినా ఆ ఎదురు చూపుల్లో భలే ఆనందం ఉండేది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-83204 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;04&sol;girl-1-1&period;jpg" alt&equals;"love failure girl real story " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఓ రోజు&comma; సాయంత్రం నేను ఇంట్లో ఉన్న సమయాన&comma; మా ఆయనతో పాటు అదే టెక్స్టైల్ కంపెనీలో పనిచేసే మరో వ్యక్తి నా దగ్గరకు వచ్చాడు&period; మీ ఆయన మా కంపెనీలో పనిచేసే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు&comma; కంపెనీ దగ్గరే ఓ ఇల్లు రెంట్ కు తీసుకొని వాళ్ళిద్దరూ ఉంటున్నారని చెప్పాడు&period; అతని మాటల్లో నిజం లేదని నాకు అనిపించింది&period; ఎందుకంటే మా ప్రేమ అంత స్వచ్ఛమైనది&period; కానీ అతను నిజం&period;&period; నిజం నేను చెప్పేది నిజం అంటుంటే&comma; అతని మాటలను అబద్ధమని నిరూపించడానికి అతనితో కలిసి బయలుదేరాను&period; దూరంగా ఓ ఇంటిని చూపించాడు&period; ఇదే మీ ఆయన ఉంటున్న ఇల్ల‌ని చెప్పాడు అతను&period; కొద్దిసేపటికి మా ఆయన మరో అమ్మాయితో కలిసి నవ్వుకుంటూ ఆ ఇంట్లోకి ఓ సంచి తో వెళ్లడం చూశాను&period; తట్టుకోలేక పోయాను&period; నా కాళ్లు అక్కడ నిలబడలేకపోయాయి&period; ఇంటికి ఎలా వచ్చానో కూడా తెలియదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నా మనసును రాయి చేసుకున్నాను&period; మా ఆయనకు ఇష్టమైన చేపల కూర వండాను&period; నాకు తెలుసు ఇదే నేను మా ఆయనకు వడ్డించే చివరి భోజనం అని&excl; ఆయన వచ్చాడు&comma; ఎప్పటిలాగే స్నానం చేసి తినడానికి కూర్చున్నారు&period; నేను కూడా నాకేం తెలియదన్నట్టు వండిన అన్నం&comma; కూర వడ్డించాను&period; బాగుంది&comma; చాలా బాగుంది అంటూ తిన్నాడు&period; ఆ క్షణం ఆయన కళ్ళల్లోకి చూసి మీరు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నారా&quest; అని అడిగాను&period; ఆయనకు అర్థమయ్యింది&period; ఏడవడం స్టార్ట్ చేశాడు&period; అప్పటికే ఏడ్చి ఏడ్చి నా కన్నిరంతా ఇంకిపోయింది&period; ఒంటి మీద ఉన్న ఓకే ఒక చీరతో ఆ ఇంటి నుండి బయలుదేరాను&period; బ్రతిమాలాడాడు&period; కానీ ప్రపంచంలో అత్యంత కఠినమైన విషయం ఏంటంటే&comma; సెకండ్ ఛాన్స్ ఇవ్వడం&comma; అది నేను ఇవ్వదలచుకోలేదు&period; నా దారి నేను వెతుక్కున్నాను&period; అలా వచ్చేసి ఇప్పటికీ 15 సంవత్సరాలు&comma; నా బతుకేదో నేను బతుకుతున్న&comma; నా గతం ఎవరికి చెప్పుకోకుండా&comma; నా వాళ్ళు ఎవరూ లేరు&comma; నేనో అనాథను అని నన్ను నేను పరిచయం చేసుకొని నా జీవనం సాగిస్తున్నా&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts