మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఇప్పటికీ నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి జనరేషన్ స్టార్ హీరోలు, యంగ్ హీరోలను మించే విధంగా చిరంజీవి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు నమోదు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. త్వరలో ఆయన ‘విశ్వంభర’ గా తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు. ఈ సంగతులు పక్కన పెడితే చిరంజీవి కెరీర్ లో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు అర్ధాంతరంగా పలు కారణాల వలన ఆగిపోయాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ సీనియర్ అండ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్విని దత్, చిరంజీవి కాంబోలో తిరకేక్కాల్సిన భారీ సినిమా ‘భూలోక వీరుడు’ అనివార్య కారణాల వలన ఆపేశారు. ఈ సినిమాకు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించాల్సి ఉంది. ఇక క్రేజీ డైరెక్టర్ RGV అలియాస్ రామ్ గోపాల్ వర్మ, చిరంజీవి కాంబోలో ఫిల్మ్ షూటింగ్ స్టార్ట్ అవడంతో పాటు, ఒక పాట షూటింగ్ కూడా పూర్తయింది. ఇందులో టబూ, ఊర్మిళలను హీరోయిన్స్ గా ఫైనల్ చేశారు. కానీ ఆ తర్వాత సినిమా ఆగిపోయింది.
‘వజ్రాల దొంగ’ అనే సినిమా కూడా అర్ధాంతరంగానే ఆగిపోయింది. ఇకపోతే ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చిరు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. కానీ షూటింగ్ మాత్రం మధ్యలోనే ఆగిపోయింది. విఎన్ ఆదిత్య కూడా ఓ సినిమా చిరంజీవితో చేయాలనుకున్నారు. కానీ, దానికి బ్రేక్ పడింది. అలా చిరు కెరీర్ లో పలు సినిమాలు అలా ఆగిపోయి ఉన్నాయి. ప్రజెంట్ చిరంజీవి, కుర్రదర్శకులతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ రాజా, మెహర్ రమేష్, బాబి, వెంకీ కుడుములతో సినిమాలు చేసిన చిరు, త్వరలో మారుతీ తోను సినిమా చేయనున్నారట.