Balakrishna Wig : నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన సినిమాలు చూస్తే ప్రేక్షకులకి పూనకాలు రావడం గ్యారెంటీ. ఇప్పటికీ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. చివరిగా డాకు మహారాజ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా ఎంతగానో అలరిస్తోంది. అయితే బాలకృష్ణ విగ్గుకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. నందమూరి బాలకృష్ణ మేకప్ వాసు కొప్పిశెట్టి ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ వాడే విగ్గు ధర ఎంత ఉంటుందనే విషయాన్ని ఆయన వెల్లడించారు.
నిజానికి నందమూరి బాలకృష్ణ తన సినిమాలకు విగ్గు వాడతారు అన్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే. నిజానికి ఆయన ఎక్కువగా సినిమాల్లో డ్యూయల్ రోల్స్ లో కనిపిస్తూ మెప్పిస్తూ ఉంటారు.. కాబట్టి ఒక రోల్ ఒరిజినల్ గానే అనిపించినా రెండవ రోల్ కోసం కచ్చితంగా విగ్గు వాడాల్సి వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే వాసు కొప్పిశెట్టి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ సినిమాల కోసం ధరించే విగ్గులను ఒక్కోసారి ముంబై నుంచి తీసుకొస్తాము అంటూ వాసు కొప్పిశెట్టి చెప్పుకొచ్చాడు. ఒక్కోసారి హైదరాబాదులో తీసుకుంటాం.
ఇప్పుడు హైదరాబాద్ లోనే అధునాతనమైన విగ్గులు అందుబాటులోకి వచ్చేసాయి . అయితే బాలకృష్ణ వాడే విగ్గుల ధర లక్షల్లోనే ఉంటుందని.. తక్కువ రకం విగ్గులు ఆయన వాడరని వాసు చెప్పుకొచ్చారు. నందమూరి బాలకృష్ణ చాలా అందగాడని ఆయన అందానికి కాస్త మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తున్నాం తప్ప అందులో తన పనితనం ఏమీ లేదని ఈ సందర్భంగా వాసు చెప్పుకొచ్చారు.