వినోదం

ఈ స్టార్ సీరియల్స్ నటీమణులు రోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారంటే..?

ప్రస్తుతం టెలివిజన్ రంగంలో సినిమాలకు ఏ మాత్రం తగ్గని సీరియల్స్ ఉన్నాయి.. ఇందులో నటించే నటీమణులకు కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.. ఈ సీరియల్స్ ద్వారా ఎంతో పాపులర్ అయిన నటీమణులు ఓ వైపు సినిమాల్లో కూడా అవకాశాలను దక్కించుకుంటున్నారు. ఒక సీరియల్ వచ్చిందంటే ఎపిసోడ్ ల మీద ఎపిసోడ్ లు వేసి దాన్ని లాగేస్తారు.. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు.. ముఖ్యంగా తెలుగులో కార్తీకదీపం, మొగలిరేకులు సీరియల్స్ ఎంత పాపులర్ అయ్యాయో మనందరికీ తెలుసు. ఇందులో నటించే నటీమణులు సినిమా తారలకు ఏ మాత్రం తీసిపోని పారితోషికం తీసుకుంటారట.. కానీ వీరికి రోజువారీగా కాల్షీట్ లెక్కన రెమ్యూనరేషన్ ఉంటుంది.. మరి ప్రస్తుతం తెలుగులో వస్తున్న టాప్ టెన్ సీరియల్ నటీమణుల ఒకరోజు పారితోషికం ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

ప్రేమి విశ్వనాథ్ ఒక రోజుకు సుమారుగా రూ.30వేల వ‌ర‌కు పారితోషికం తీసుకుంటుండ‌గా.. ఈమె కార్తీకదీపం సీరియల్ ద్వారా వంటలక్క గా చాలా పాపులర్ అయిపోయింది. మొదటిగా హీరోయిన్ గా పరిచయమైన సుహాసిని.. తర్వాత సీరియల్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఈమె రూ25వేల వ‌ర‌కు తీసుకుంటోంది. బుల్లితెర అనుష్క గా పేరు తెచ్చుకున్న పల్లవికి ఆడదే ఆధారం సీరియల్ బ్రేక్ ఇచ్చింది.. పల్లవి రామిశెట్టి రూ.15000 తీసుకుంటోంది. చంద్రముఖి సీరియల్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన మంజుల‌.. ప్రస్తుతం మంచి సీరియల్ నటిగా ఎదిగింది.. మంజుల రూ.8000 వ‌ర‌కు తీసుకుంటోంది.

do you know how much these serial actress getting as remuneration

కొద్దిరోజులు అదిరింది షో యాంకర్ గా చేసిన సమీరా.. సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. సమీరా షరీఫ్ రూ.10000 వ‌ర‌కు తీసుకుంటోంది. కథలో రాజకుమారి సీరియల్ ద్వారా చాలా పేరుతెచ్చుకున్న అషికా రూ.12000 వ‌ర‌కు తీసుకుంటోంది. కుంకుమ పువ్వు ముద్దమందారం లాంటి సీరియల్స్ లో అదరగొడుతున్న హ‌రిత రూ.12వేల వ‌ర‌కు తీసుకుంటోంది. ఓ వైపు సినిమాలు మరో వైపు సీరియల్స్ ద్వారా దూసుకుపోతున్న ప్రీతినిగమ్ రూ.10000 తీసుకుంటుండ‌గా.. ప్రస్తుతం ఆమెకథ సీరియల్ ద్వారా మెస్మరైజ్ చేస్తున్న నవ్య స్వామి రూ.20000 వ‌ర‌కు తీసుకుంటోంది. అలాగే అగ్నిసాక్షి సీరియల్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఐశ్వర్య రూ.20000 తీసుకుంటోంది.

Admin

Recent Posts