Off Beat

బీరు సీసాలు ఆ రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా.??

సాధారణంగా బీరు బాటిల్స్ బ్రౌన్ లేదా గ్రీన్ కలర్ లో ఉంటాయి. అయితే ఇది ఇప్పటి నుంచి వస్తోంది కాదు. చాలా ఏళ్ల క్రితం నుంచే బీరు బాటిల్స్ ఆ రెండు రంగుల్లోకి వచ్చేసాయి. ఎవరినైనా ఆ ప్రశ్న అడగండి… బాటిల్ ఏ కలర్ లో ఉంటే మనకెందుకు బీర్ టేస్ట్ గా ఉంటే చాలని సమాధానం ఇస్తారు. ఆ టేస్ట్ రావడం కోసమే బీరు బాటిల్స్ ఆ రెండు కలర్స్ లో తయారు చేస్తారు. చాలా ఏళ్ల క్రితం బీరు బాటిల్స్ నార్మల్ గా ఉండే సీసాల్లోనే నిల్వ చేసేవారు.

అయితే ఆ బాటిల్స్ కు నేరుగా సూర్య రశ్మి తగిలి బీరు టెస్ట్ మారిపోవడం… అదే విధంగా యూవీ కిరణాలు తగిలి బీరు వాసన వచ్చేది. ఈ సమస్యకు పరిష్కారంగా గోధుమ రంగులో ఉండే బాటిల్స్ తయారు చేసి చూసారు. దీంతో ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. ఎందుకంటే బ్రౌన్ కలర్ యూవీ కిరణాలను బాటిల్స్ లోకి వెళ్లనివ్వదట. అలాగే బీరుకు ఎలాంటి చేటు చేయకపోవడంతో దానినే వాడడం మొదలు పెట్టారు.

do you know why beer bottle in that color

అలాగే రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రౌన్ కలర్ బాటిల్స్ దొరకకపోవడంతో చేసేదేమి లేక గ్రీన్ కలర్ బాటిల్స్ లో నింపడం మొదలు పెట్టారు. అయితే ఈ గ్రీన్ కలర్ బాటిల్స్ లో బీరు పాడవ్వకపోవడం… అలాగే రుచి కూడా మారకపోవడంతో బీరును ఈ రంగు బాటిల్స్ లోనూ నింపడం ప్రారంభించారు. ఇక అలా బీరు బాటిల్స్ ఒక్కో బ్రాండ్ ఒక్కో రంగులో అమ్ముతున్నారు.

Admin

Recent Posts