వినోదం

వంటలక్కకు కార్తీకదీపం సీరియల్ లో ఎలా ఛాన్స్ వచ్చిందో తెలుసా..!

కార్తీకదీపం.. బుల్లితెర బాహుబలి గా స్థిరపడిపోయిన ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్లుగా ఈ సీరియల్ జాతీయ స్థాయిలో తగ్గేదేలే అన్నట్లు దూసుకుపోతోంది. ఈ సీరియల్ అంటే చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వ‌ర‌కు సైతం టీవీలకు అతుక్కుపోతుంటారు. అయితే ఈ సీరియల్ తో బుల్లితెర రాణిగా పేరు తెచ్చుకున్న వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ కి అసలు ఈ సీరియల్ లో ఛాన్స్ ఎలా వచ్చిందో తెలుసుకుందాం.

ప్రేమీ విశ్వనాథ్ స్వస్థలం కేరళ రాష్ట్రం ఎర్నాకులం జిల్లాలోని ఎడప్పల్లి ప్రాంతం. వంటలక్కకి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. లా కంప్లీట్ చేసిన వంటలక్క కొంతకాలం పాటు లీగల్ అడ్వైజర్ గా కూడా చేసింది. అయితే ఫోటోలు తీయాలనే ఆసక్తితో ఫోటోగ్రఫీ నేర్చుకుని.. పెళ్లిళ్లకు ఫోటోగ్రాఫర్ గా కూడా వర్క్ చేసింది. ఆ తర్వాత నటన మీద ఉన్న ఆసక్తితో మోడలింగ్ చేస్తూ మలయాళీ సీరియల్ కరముత్తూలో నటించింది. ఈ సీరియల్ చేస్తూనే కొన్ని ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా కూడా చేసింది. మలయాళం లో కరముత్తు సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ సీరియల్ ని తెలుగులో కార్తీకదీపం పేరుతో రీమేక్ చేశారు.

do you know how premi vishwanath got chance in karthika deepam serial

ఈ సీరియల్ తెలుగులో ఏ రేంజ్ లో దూసుకుపోతుందో తెలిసిందే. ఈ సీరియల్ లో నటిస్తూ రెండు తెలుగు రాష్ట్రాలలో లక్షలాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది.

Admin

Recent Posts