Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

ఉప్పు, పప్పుకు కూడా అప్పు చేయాలి, పోరా అని అవమానించిన కిరాణావాడు, ఒకప్పటి రాజమౌళి దుస్థితి తెలుసా?

Admin by Admin
February 24, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఇప్పుడు రాజమౌళి టాలీవుడ్ రిచెస్ట్ దర్శకుడు. కానీ దర్శకుడు కాకముందు ఆయన అత్యంత పేదరికం అనుభవించాడు. నిత్యావసర సరుకుల‌కు కూడా అప్పులు చేసేవారట. రాజమౌళి దేశంలోనే నెంబర్ వన్ దర్శకుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. రాజమౌళి సినిమాకు ఆయనే కర్త, కర్మ, క్రియ. ఏళ్ల తరబడి సినిమాను చెక్కుతారు. అందుకే జక్కన్న అనే నిక్ నేమ్ కూడా ఉంది. ఇక రాజమౌళి రికార్డులు ఎవరూ చేరుకోలేనివి. అపజయం ఎరుగని దర్శకుడిగా ఉన్న రాజమౌళి.. బాహుబలి, బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ కొల్లగొట్టాడు. వేల కోట్ల వసూళ్లు తెలుగు సినిమాకు సాధ్యమే అని నిరూపించాడు. నిజానికి వందల కోట్ల బడ్జెట్ తో మూవీ నిర్మించడం చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం.

ప్రస్తుతం రాజమౌళికి ఉన్న డిమాండ్ రీత్యా సినిమాకు వంద కోట్లకు పైగా రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధం. రెండు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాను ఏలుతున్న రాజమౌళి భారీగా ఆర్జించారు. ఆయన ఆస్తుల విలువ రూ. 158 కోట్లు ఉంటుందని ఒక అంచనా. సినిమా రెమ్యూనరేషన్ ఆయన ప్రధాన ఆదాయమార్గం. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఓ నిర్మాణ సంస్థ కూడా ఉంది. రిచెస్ట్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్న రాజమౌళి ఒకప్పటి జీవితం తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. అత్యంత పేదరికం రాజమౌళి కుటుంబం అనుభవించిందట. నిత్యావసర సరుకులకు అప్పు చేయాల్సిన పరిస్థితి ఉండేదట. ఈ విషయం రాజమౌళి ఓ సందర్భంలో స్వయంగా వెల్లడించారు. జీవితంలో మీకు ఎదురైన అవమానాలు ఏమిటని అడగ్గా..

do you know rajamouli once faced poverty

మేము చెన్నైలో ఉన్న రోజుల్లో నాన్న ఘోస్ట్ రైటర్ గా పని చేసేవాడు. ఈ ఘోస్ట్ రైటర్స్ కి ఎప్పుడో ఒకసారి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు వచ్చినప్పుడు కిరాణా కొట్టులో చేసిన అప్పు తీర్చేవాళ్ళం. మరలా అప్పు తెచ్చుకునేవాళ్ళం. కిరాణావాడు రూ. 100-150 రూపాయల అప్పు వరకు బాగానే ఇచ్చేవాడు. తర్వాత విసుక్కునేవాడు. ఒకరోజు కూరగాయల కోసం నేను దుకాణానికి వెళ్ళాను. వాడు ఏవో లెక్కలు చూసుకుంటున్నాడు. నేను ఒకటికి రెండు సార్లు… అన్నా నాకు ఇవ్వు అని అడుగుతున్నాను. వాడు పట్టించుకోవడం లేదు. నేను గట్టిగా అన్నా… కూరగాయలు ఇవ్వు అనగానే… పోరా అని అరిచాడు. అప్పుడు నాకు చాలా అవమానం అనిపించింది. నేను పెద్దయ్యాక డబ్బులు సంపాదించి, కిరాయి మనుషులతో వీడిని కొట్టించాలని అప్పుడు నాకు అనిపించింది, అని రాజమౌళి చెప్పుకొచ్చాడు.

బహుశా బాల్యంలో రాజమౌళి అంతటి పేదరికం అనుభవించడం వల్లనేమో డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. అతిగా దానధర్మాలు చేయరు. కరోనా సమయంలో ఇండస్ట్రీ ప్రముఖులు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు. రాజమౌళి తక్కువ మొత్తం ఇచ్చాడు. ఈ క్రమంలో విమర్శలు ఎదుర్కొన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో అప్ప‌ట్లో వరదలు సంభవించాయి. నటులు, దర్శక నిర్మాతలు విరాళాలు ఇచ్చారు. రాజమౌళి ప్రకటించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుందట. ఇటీవల రచయిత విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఎస్ఎస్ఎంబి 29 యాక్షన్ అడ్వెంచర్ డ్రామా. దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నారట.

ఈ ప్రాజెక్ట్ కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులు, నటులు పని చేయనున్నారని సమాచారం. మరోవైపు మహేష్ బాబు ఈ మూవీ కోసం సరికొత్తగా సిద్ధమయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పొడవాటి జుట్టు, గుబురైన గడ్డంతో మహేష్ లుక్ అంచనాలు పెంచేదిగా ఉంది. రాజమౌళి తన హీరోలను గత చిత్రాలకు భిన్నంగా ప్రజెంట్ చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబి 29పై ఇండియా వైడ్ అంచనాలు ఉన్నాయి.

Tags: Rajamouli
Previous Post

గజ్జె ఘ‌ల్లుమన్నదో గుండె ఝల్లుమన్నదో పాటలో బూతు ఉంద‌న్న ఎస్పీ బాలు.. అందులో అర్థం ఏమిటి..?

Next Post

ఒక‌ప్ప‌టి మూవీల్లో ప‌ర‌మ చెత్త మూవీలుగా అనిపించుకున్న‌వి ఏమిటో తెలుసా..?

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!