వినోదం

మాస్ మహారాజ్ రిజెక్ట్ చేసిన 10 సినిమాలు ఏవో తెలుసా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అంచలంచలుగా తమ నటనతో అందరినీ మెప్పిస్తూ, తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపుని తెచ్చుకున్నారు. అలాంటి కోవలోకి మెగాస్టార్ తర్వాత వచ్చే హీరోలలో రవితేజ కూడా ఒకరు అని చెప్పుకోవాలి. మాస్ మహారాజా అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే రవితేజ ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరో అయ్యారు. కెరీర్ ఆరంభంలో చిన్నాచితక వేషాలు వేసి.. స్టార్ హీరోగా ఎదిగాడు. స్వయంకృషితో, పట్టుదలతో స్టార్ గా ఎదిగి మరెందరికో చాన్సులు ఇచ్చి.. వాళ్లను కూడా స్టార్లను చేశాడు. అలాంటి రవితేజ తన సినీ కెరీర్ లో దాదాపు 10 సినిమాలకు నో చెప్పాడు. తన 30 సంవత్సరాల కెరీర్ లో ఎన్నో హిట్, ప్లాప్ సినిమాలను ఫేస్ చేసిన రవితేజ రిజెక్ట్ చేసిన సినిమాలు ఏవో చూద్దాం..

శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆనందం సినిమా కథను శ్రీను వైట్ల ముందుగా రవితేజకు చెప్పారు. అయితే రవితేజ వేరే సినిమాలో బిజీగా ఉండడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్య‌ని అల్లు అర్జున్ కంటే ముందు సుకుమార్ చాలామందికి చెప్పారు. అందులో రవితేజ కూడా ఉన్నారు. ఆయనకి ఈ లవ్ స్టోరీ నచ్చకపోవడంతో సినిమాని వదులుకున్నారు. మహా సముద్రం మూవీ స్టోరీని ముందుగా రవితేజ కి చెప్పారట. కానీ రవితేజ బిజీగా ఉండడంతో నో చెప్పారట. శేఖర్ కమ్ముల గోదావరి స్టోరీని ముందు రవితేజ కి చెప్పారంట. కానీ రవితేజ కి రాజమౌళితో విక్రమార్కుడు సినిమా అవకాశం రావడంతో ఈ సినిమాని రిజెక్ట్ చేశారట.

do you know ravi teja rejected these movies

హరిష్ శంకర్ గబ్బర్ సింగ్ మూవీని మొదట రవితేజ తోనే ప్లాన్ చేశారట. కానీ ఈ మూవీ రీమేక్ రైట్స్ పవన్ కళ్యాణ్ తీసుకోవడంతో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేశారు. వేణు శ్రీరామ్ ఎంసీఏ మూవీని రవితేజతో తీద్దాం అనుకున్నారట. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల నానితో తీశారు. జై లవకుశ మూవీని రవితేజతో ప్లాన్ చేశారు కానీ చివరకు ఎన్టీఆర్ తో తీశారు. బాడీగార్డ్ రీమేక్ మూవీ కథ‌ని ముందు రవితేజ కి చెప్పారట. కానీ రవితేజ డ్రాప్ కావడంతో విక్టరీ వెంకటేష్ తో చేశారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో మహేష్ బాబు స్థానంలో రవితేజ నటించాల్సింది. కానీ చివరి నిమిషంలో మహేష్ బాబుని ఓకే చేశారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన పోకిరి స్టోరీని చెప్పారు. కానీ అప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ సినిమాని వదులుకున్నారు.

Admin

Recent Posts