మన తెలుగు హీరోలు ఎంతో టాలెంట్ ఉన్నవారు. యాక్టింగ్, డాన్స్ తో పాటు.. డైలాగులతో ఇరగదీస్తారు. అయితే.. ఒక్కో సమయాల్లో స్టార్ హీరోలు కూడా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని సినిమాల్లో వేరొక హీరో వాయిస్ ఓవర్ ఇస్తారు. అలా ఒక హీరో నటించిన సినిమాకు ఇంకొక హీరో వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలు ఎంటో ఇప్పుడు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాకు అలాగే రానా హీరోగా నటించిన ఘాజి సినిమాకు, మంచు మనోజ్ హీరోగా నటించిన గుంటూరోడు సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమా కు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన బాద్ షా సినిమాకు, అలాగే తన సోదరి మంజుల దర్శకత్వం వహించిన మనసుకు నచ్చింది సినిమాకు, ఆచార్య సినిమాకు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చారు మహేష్ బాబు. కింగ్ నాగార్జున.. నాగచైతన్య హీరోగా నటించిన ప్రేమమ్ సినిమా కు, అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు.
హీరో రామ్ నటించిన రామ రామ కృష్ణ కృష్ణ సినిమా కు జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. నితిన్ హీరోగా నటించిన శ్రీనివాస కళ్యాణం సినిమా కు అలాగే….రవితేజ క్రాక్ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు వెంకీ మామ.