వినోదం

టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు వారి కంటే ఎక్కువ సంపాదిస్తారని తెలుసా..?

సాధారణంగా సెలబ్రిటీల జీవితాలు ఎప్పుడూ గోప్యంగానే ఉంటాయి. వీటిలో ముఖ్యంగా హీరోలకు సంబంధించిన భార్యలు, వారి కుటుంబానికి సంబంధించిన విషయాలు బయటకు రావు అనేది ఒకప్పుడు ఉండే ట్రెండ్.. కానీ ప్రస్తుత కాలంలో వారి భార్యలు భర్తల తో పాటుగా వారికి నచ్చిన రంగాలలో స్థిరపడుతున్నారు. సినీ ఇండస్ట్రీలో హీరో గా సెట్ అయిన భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల భార్యలు మాత్రం సొంతంగా వారి ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. వాళ్లు ఎవరో ఓ లుక్కేద్దాం..

నాని భార్య అంజన: నేచురల్ స్టార్ నాని భార్య అంజనా బెంగళూరు నిఫ్ట్ లో ఫ్యాషన్ డిజైనర్ గా శిక్షణ తీసుకుంది. రాజమౌళి ఆర్కా మీడియా లో క్రియేటివ్ హెడ్ గా పని చేస్తోంది. రాజీవ్ కనకాల భార్య యాంకర్ సుమ : యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే టాప్ యాంకర్ గా పేరు పొంది ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు యాక్టింగ్ చేస్తూ నిర్మాణ రంగంలో రెండు చేతులా సంపాదిస్తుంది. రామ్ చరణ్ భార్య ఉపాసన : రామ్ చరణ్ వైఫ్ ఉపాసన ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అపోలో హాస్పిటల్ లో చురుకైన పాత్ర వహిస్తూ సోషల్ యాక్టివిటీస్ లో కూడా పాల్గొంటుంది.

do you know that these actress also earning more than their actor husbands

అల్లరి నరేష్ భార్య విరూప : అల్లరి నరేష్ వైఫ్ విరూపా కార్పొరేట్ వివాహాది శుభకార్యాలకు ఈవెంట్ మేనేజర్ గా పనిచేస్తోంది. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్పెక్ట్రం అనే మ్యాగజైన్ కి చీఫ్ ఎడిటర్ గా పని చేస్తోంది. సెయింట్ ఇన్స్టిట్యూట్స్ ని కూడా చూసుకుంటుంది. రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి : రాహుల్ రవీంద్రన్ భార్య తనకంటే ఎక్కువ ఇన్కంటాక్స్ పే చేస్తోందని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఆమె ఎవరో కాదు గాయని చిన్మయి. హీరోయిన్ సమంత కి డబ్బింగ్ చేప్పేది ఈమెనే.

Admin

Recent Posts