టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే. పిల్లలు, పెద్దలు అనే తేడాలు లేకుండా అందరూ ఆయనను అభిమానిస్తుంటారు. వెంకటేష్ ఎక్కువగా కుటుంబ కథ చిత్రాలలో నటించగా ఆయన సినిమాలలో ఎక్కువ సినిమాలు విజయాలను సొంతం చేసుకున్నాయి.
నారప్ప దృశ్యం 2 సినిమాలతో విజయాలను అందుకున్న వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో సక్సెస్ ను పొందారు. వెంకటేష్ ఎక్కువగా కుటుంబ కథ చిత్రాలలో నటించగా ఆయన సినిమాలలో ఎక్కువ సినిమాలు విజయాలను సొంతం చేసుకున్నాయి.
గతంలో నారప్ప, దృశ్యం 2 సినిమాలతో విజయాలను అందుకున్న వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరో సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. ఇది ఇలా ఉండగా, వెంకటేష్ గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలను నిర్మాత మురళీమోహన్ ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అవేంటో చూద్దాం, వెంకటేష్ కు మొహమాటం ఎక్కువగా ఉంటుందని, మా అసోసియేషన్ ఏర్పడినప్పటి నుంచి దానికి అధ్యక్షుడిగా హీరోలనే ఉంచాలని అందరూ భావించి నిర్ణయం తీసుకున్నారట. ఎందుకంటే ఏ పని జరగాలన్నా హీరోలు ఉంటే తొందరగా జరుగుతుందని వారు ఆ నిర్ణయం తీసుకున్నారట. కమెడియన్లు లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులు చిన్న చిన్న వేషాలు వేసుకునే వారిని ఉంచితే పనులు స్పీడుగా జరగవని వారి మాటలను స్టార్ హీరోలు వినరని అన్నారు.
అదే హీరోలను ఉంచితే వారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుందని, వారి మాట ఇష్టపడడానికి చాలామంది ఉంటారని అందుకే మా అసోసియేషన్ అధ్యక్షుడిగా హీరోలనే కొనసాగించే విషయం బయట పెట్టారు. ఇప్పటికే ఇండస్ట్రీలో మోహన్ బాబు, చిరంజీవి, నాగార్జున లాంటివారు అధ్యక్ష పదవిని చేపట్టారు. కానీ ఒకానొక సమయంలో హీరో వెంకటేష్ మా అధ్యక్ష పదవిని చేపట్టమని అడిగితే ఆయన సున్నితంగా తిరస్కరించాడట. మా అసోసియేషన్ మొత్తం వెళ్లి బ్రతిమిలాడిన వారు దాని గురించి నాకు పెద్దగా తెలియదని అన్నారట వెంకటేష్. చివరికి అందరూ బలవంతం చేయడంతో ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా ఉంటానని ఒప్పుకున్నాడట. ఒకసారి ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడైన వెంకటేష్ ఇప్పటికి కూడా అధ్యక్ష పదవిని చేపట్టలేదని, దీన్ని బట్టి చూస్తే ఆయన సున్నిత మనస్తత్వం ఎలాంటిదో మీరు అర్థం చేసుకోవాలని మురళీమోహన్ అన్నారు. ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వెంకటేష్ అభిమానులు చాలా ఆనంద పడుతున్నారు.