టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖులు కరోనా అలాగే ఇతర అనారోగ్యాల కారణంగా మృతి చెందారు. ఇక టాలీవుడ్ సీనియర్ ఎడిటర్ అలాగే స్టార్ ఎడిటర్ అయినా గౌతమ్ రాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. 68 ఏళ్ల వయసు కలిగిన గౌతమ్ రాజు, కిడ్నీ, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈయన తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ భాషల్లో మొత్తంగా కలుపుకొని 800 కి పైగా చిత్రాలకు ఎడిటర్ గా పనిచేశారు. ఎన్నో అవార్డులు, రివార్డులు కూడా పొందారు.
సాధారణంగా ఎడిటర్ కు ప్రేక్షకుల్లో పెద్ద గుర్తింపు ఉండదు. మనం సినిమా చూస్తున్నప్పుడు లెంగ్త్ ఎక్కువైనా, తక్కువైనా పరోక్షంగా తిట్టుకునేది వీరినే. ఏ పెద్ద సినిమాకి సంబంధించిన లీకులు బయటకు వచ్చిన వీళ్ళని మనం పరోక్షంగా తిట్టుకుంటూ ఉంటాం. అయితే ఓ సినిమా ఫలితం ఎక్కువ శాతం ఆధారపడి ఉండేది ఎడిటర్ పైనే! ఎడిటర్ ను దర్శక నిర్మాతలు ఎంత బాగా వాడుకుంటే, అవుట్ ఫుట్ అంత బాగా వస్తుంది. అయితే గౌతం రాజు ఎడిటర్ గా చాలా సినిమాలకు దాదాపు మంచి అవుట్ ఫుట్ ని ఇచ్చారు, అని చెప్పాలి. కొన్ని జనరేషన్స్ గడిచిన, మరచిపోలేని సినిమాలు గౌతమ్ రాజు అందించారు. మరి ఆయన కెరీర్లో ది బెస్ట్ అనిపించిన సినిమాలు ఏంటో ఓ లుక్ వేద్దాం రండి.
#1 జానకి రాముడు
#2 దళపతి
#3 కర్తవ్యం
#4 అసెంబ్లీ రౌడీ
#5 వారసుడు
# 6 పెదరాయుడు
#7 సూర్యవంశం
#8 సుస్వాగతం
#9 ఠాగూర్
#10 యజ్ఞం