వినోదం

హిట్ టాక్ వచ్చి ఫ్లాప్ అయిన సినిమాలు ఏంటో మీకు తెలుసా..?

సినిమా రిలీజ్ అయింది అంటే ఒకటి రెండు రోజుల్లోనే సినిమా హిట్టా ఫట్టా అనే విషయం కొంతవరకు తెలిసిపోతుంది. కానీ కొన్ని సినిమాలు మాత్రం మొదట్లో హిట్ టాక్ వచ్చినా, తర్వాత మాత్రం కాస్త తడబడి ఫ్లాప్ లుగా నిలుస్తాయి. మరి హిట్ టాక్ వచ్చి ఫ్లాప్ గా నిలిచిన సినిమాలు ఏంటో ఒక సారి చూద్దాం.

ఆపద్బాంధవుడు:

మెగాస్టార్ చిరంజీవి కె.విశ్వనాథ్ కాంబినేషన్ లో రూపొందించిన క్లాసిక్ మూవీ ఆపద్బాంధవుడు. 1992లో ఘరానా మొగుడు లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చిరంజీవి నటించిన మూవీ ఇదే. ఆపద్బాంధవుడు సినిమా చిరంజీవి కెరీర్ లోనే బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక అంతా బాగుందనే టాక్ వచ్చింది. రివ్యూ కూడా పాజిటివ్ గానే వచ్చింది. సినిమా హిట్ అని అంతా అనుకునే సమయంలో వారం వారం సినిమా తగ్గిపోతూ చివరికి ఫ్లాప్ మూవీ గా నిలిచింది.

మిత్రుడు :

బాలకృష్ణ అంటేనే ఒకటి రెండు సినిమాలు తప్ప ఆయన సినీ కెరీర్ లో అన్ని మాస్ చిత్రాలే. కానీ 2009 లో రిలీజ్ అయిన మిత్రుడు సినిమా లో బాలకృష్ణ చాలా క్లాస్ గా కనిపించారు. అందులో ఆయన యాక్టింగ్ కూడా కొత్తగా ఉంటుంది. సినిమాకు మంచి రివ్యూ వచ్చింది. బాలయ్య కెరీర్లోనే క్లాస్ హిట్ అవుతుంది అనుకున్నారు. ఫ్యాన్స్ కు కష్టమైన మిగతా ఆడియన్స్ కు బాగా అర్థం అవుతుంది అని భావించారు. కానీ ఈ సినిమా చివరికి ఫ్లాప్ అయింది.

do you know that these movies became flop after hit talk first

ఎదురులేని మనిషి :

ఫ్యాక్షన్ సినిమాల కాలం నడుస్తున్న తరుణంలో కొంచెం అటు వంటి సినిమాలే చేశారు నాగార్జున. 2001లో విడుదలైన ఎదురులేని మనిషి మొదటివారంలోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నాగార్జున పవర్ఫుల్ ఫ్యాన్స్ కి బాగా నచ్చి, కలెక్షన్స్ కూడా మొదటి వారం చాలా ఉన్నాయి. కానీ వారం వారం కలెక్షన్లు తగ్గుతూ వచ్చి చివరికి ఫ్లాప్ గా నిలిచింది.

అంటే సుందరానికి :

నాని మూవీ అంటే సుందరానికి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్నా విచిత్రంగా ఫెయిల్ అయిపోయింది. పెరిగిన టికెట్ ధరలు అప్పటికే వరుసపెట్టి సినిమాలు రావడంతో అంటే సుందరానికి మూవీ బిగ్ మైనస్ అయింది. దీంతో నాని కెరీర్ లోనే పెద్ద ప్లాప్ గా అంటే సుందరానికి మూవీ నిలిచింది.

Admin

Recent Posts