పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైన మరపురాని ఘట్టం.. ఇది సాధారణ వ్యక్తులకు అయితే ఒక విధంగా ఉంటుంది. కానీ సినీ ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ విషయానికి వస్తే వారు ఏది చేసినా హైలెట్ అవుతూనే ఉంటుంది.. అయితే ఇండస్ట్రీలో వారి యొక్క కో నటులనే ప్రేమించి మరి వివాహం చేసుకున్నా వారు ఎవరో ఓ లుక్కేద్దాం.. మహేష్ బాబు-నమ్రత: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో అందరూ మెచ్చే హీరో మహేష్ బాబు. ఆయన ఇప్పటికి ఎంతో మంది అమ్మాయిలకు కలల రాకుమారుడు గా మారిపోయారు. కానీ ఆయనకు మాత్రం తన భార్య నమ్రత అంటే చాలా ఇష్టం అని అంటారు. ఆయన సక్సెస్ వెనక ఉన్నది కూడా నమ్రత అని చెబుతూ ఉంటారు. వంశీ చిత్రంలో వీరిద్దరు కలిసి నటించి ప్రేమలో పడి పెళ్ళి చేసుకున్నారు.
నాగార్జున-అమల: టాలీవుడ్ మన్మధుడు నాగార్జున కూడా అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతున్నా నాగార్జున అమల ఎంతో అన్యోన్యంగా జీవిస్తారు. సూర్య-జ్యోతిక: గజిని సినిమా తో తెలుగు తెరకు పరిచయమైన సూర్య ఇక అనేక సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నారు. హీరో సూర్య హీరోయిన్ జ్యోతిక ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి సినిమాల్లో నటిస్తున్న క్రమంలోనే ప్రేమలో పడ్డారు. తర్వాత పెళ్లి చేసుకోగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
అజిత్-శాలిని : సౌత్ ఇండియా లో హీరో అజిత్ కు ఉన్న ఫాలోయింగ్ ఎవరికీ లేదని చెప్పవచ్చు. అలాంటి అజిత్ కుమార్ హీరోయిన్ షాలిని తో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు శ్రీకాంత్-ఊహ, జీవిత- రాజశేఖర్, కృష్ణ-విజయ నిర్మల, శరత్ కుమార్-రాధిక ఇంకా ఎంతోమంది ఉన్నారు.