1970 తెలుగు ఇండస్ట్రీలో హీరోలుగా రాణించిన వారిలో జానపద కథానాయకుడిగా ఆంధ్ర కమల్ హాసన్ గా పేరుపొందిన నటుడు నరసింహ రాజు. 1974లో “నీడలేని ఆడది” అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు ఆయన. ఆ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత ఇదెక్కడి న్యాయం, తూర్పు-పడమర, జగన్మోహిని ఇలా వరుసగా ఎన్నో సినిమాలు చేసి మంచి పేరు సంపాదించారు. ముఖ్యంగా జానపద కథానాయకుడిగా నటించిన సినిమాల్లో ప్రేక్షకులకు చాలా గుర్తుండిపోయాయి.
ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా నటన మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు నరసింహరాజు. అలా ఎన్నో సినిమాలు నటించిన నరసింహ రాజు రాను రాను సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సీరియల్ నటుడిగా చాలాకాలం కొనసాగారు. ఇక ఆయన కుటుంబ నేపథ్యంలోకి వెళితే మాత్రం నరసింహారాజు కి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇందులో ఒక కొడుకు ఒక కూతురు.. కూతురు హైదరాబాదులో ఉద్యోగం చేస్తూ స్థిరపడింది.
ఇక కొడుకు విషయానికి వస్తే ఆయన పై చదువుల కోసం అమెరికా వెళ్లి కెనడాలో ఒక హైయెస్ట్ పొజిషన్లో ఉన్నారు.. కెనడాలోని దాదాపుగా 10 ఎకరాలకు పైగా రెండు తోటలు, పెద్ద పెద్ద 2 ప్యాలెస్ ను కూడా ఉన్నాయి. ఈ విధంగా చూస్తే నరసింహ రాజు కొడుకు మామూలు వ్యక్తి అయితే కాదు. ఈయన సంపాదించిన ఆస్తులను బట్టే చెప్పవచ్చు కొన్ని వందల కోట్ల విలువ చేస్తాయని. ఇలా విదేశాల్లో కొన్ని వందల కోట్ల ఆస్తులు ఈ సీనియర్ హీరో నటుడి కొడుకుకు ఉన్నాయి. లేటెస్ట్ గా ఈయన విషయం బయటకు వచ్చి అందరి నోట్లో నానుతోంది.