వినోదం

సినిమా షూటింగుల్లో తీసే ప్రతీ సీనుకీ కెమెరా ముందు ఒక చెక్క పలక పెట్టి క్లాప్ అని పిలుస్తుంటారు. దాని అవసరమేంటి? ఎందుకు దాన్ని వాడతారు?

<p style&equals;"text-align&colon; justify&semi;">క్లాప్‌బోర్డ్ అనేదాని పేరు చప్పట్లు &lpar;Clap&rpar; అనే సౌండునుంచే వొచ్చి ఉండాలి&period;&period; అంటే చప్పట్లలాంటి ఒక సౌండు&period;&period; ఆ శబ్దాన్ని వీడియో&comma; ఆడియో సింక్ చేయడానికి వాడతారు&period;&period; ఇంతకుముందు పిక్చర్ నెగెటివ్&comma; సౌండ్ నెగెటివ్ రెండు ఫిల్ములమీద వేరువేరుగా రికార్డయేవి&period;&period; ఆ రెండిటిని ఎడిటింగు మూవియోలా మీద ఎక్కించినప్పుడు క్లాప్ జరిగిన వీడియో&comma; క్లాప్ సౌండ్ వొచ్చిన ఆడియోని మ్యాచ్ చేస్తే అక్కణ్ణుంచి మిగతాదంతా పెర్ఫెక్టుగా సింక్ అయేది&period;&period; అందుకే క్లాప్ బోర్డుమీద సీన్ నంబరు&comma; షాట్ నంబరు&comma; టేక్ నంబరు&comma; డేటు తప్పనిసరిగా ఉంటాయి&period;&period; క్లాప్ అసిస్టెంటు కెమెరా రన్నవడం మొదలయ్యాక ఆ వివరాలన్నీ చదువుతాడు&period;&period; డైరెక్టర్ క్లాప్ అన్నాక పెద్ద సౌండ్ వొచ్చేట్టు క్లాప్ కొట్టి ఫ్రేము బైటికి పరిగెత్తుతాడు&period;&period; అతను బైటికి వెళ్లాక అప్పుడు యాక్షన్ చెబ్తాడు డైరెక్టరు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమాలోని ప్రతి సీనుకి&comma; షాటుకి&comma; టేకుకి ఇది తప్పనిసరి&period;&period; దీనినిబట్టి ఎడిటింగు రిపోర్టు రాస్తాడు ఇంకో అసిస్టెంటు డైరెక్టరు&period;&period; ఒక వైడ్ షాట్ అయితే పెద్ద సౌండ్ వొచ్చేట్టుగా క్లాప్ కొట్టాలి&period;&period; క్లోజప్ అయితే నెమ్మదిగా కొట్టి వెళ్లిపోవాలి&period;&period; క్లోజప్పులో క్లాప్ సౌండువల్ల ఒక్కోసారి డిస్టర్బెన్సు వొస్తోందని యాక్టరు కంప్లెయిన్ చేస్తే టేకు అయిపోయాక కట్ చెప్పగానే ఎండ్ క్లాప్ ఇచ్చిన సందర్భాలూ తెలుసు&period;&period; ఇంతకుముందు క్లాప్ బోర్డుమీద వైట్ చాక్‌పీసుతో రాసేవారు&period;&period; క్లోజప్ షాట్ పెట్టినప్పుడు ఒక్కోసారి క్లాప్ కొట్టగానే ఆ పౌడరు రాలుతూ కనిపించేది&period;&period; అది పూర్తిగా రాలిపోయి సెటిలయ్యాక అప్పుడు యాక్షన్ చెప్పేవాడు డైరెక్టరు&period;&period; తరవాత అక్రిలిక్ బోర్డు మీద మార్కర్లతో రాయడం మొదలైంది&period;&period; చిరంజీవి హాలీవుడ్ సినిమాకి ఏడీగా వెళ్లినప్పుడు డిజిటల్ డిస్‌ప్లే బోర్డ్స్ మొదటిసారి చూశాను&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-80512 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;movie-clapboard&period;jpg" alt&equals;"do you know what is movie clap and how it works " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">క్లాప్ కొట్టేవాడికి ఫ్రేము పూర్తి అవగాహన ఉండాలి&period;&period; షార్పుగా&comma; స్పష్టంగా ఎనౌన్సు చేసి స్మార్టుగా తప్పుకోవాలి&period;&period; ఫ్రేము విడ్త్ ఎంత&comma; ఎడ్జెస్ ఏంటి&comma; డెప్త్ ఆఫ్ ఫీల్డ్&comma; ఫోకస్ ఎంతుంది ఈ వివరాలన్నీ తెలిసుండాలి&period;&period; ఎందుకో చెబ్తాను&period;&period; ఒక సినిమాలో ఎనభై సీన్లు&comma; వెయ్యి షాట్లు&comma; రెండున్నరవేల రీటేకులు ఉన్నాయనుకుందాం&period;&period; కెమెరా రన్నవడం మొదలుపెట్తాక ఒక వైడుషాటులో ఫ్రేము మధ్యలో నిల్చుని ఎనౌన్సు చేసి ఫ్రేము బైటికి అతను పరుగెత్తి అప్పుడు యాక్షన్ చెప్పడానికి పట్టే సమయం దాదాపు పది సెకన్లు&period;&period; మొత్తం టేకుల్లో నాలుగోవంతు టేకులకి ఒక్కో టేకుకి పది సెకన్లు&period;&period; మిగతావాటికి ఒక్కోదానికి అయిదు సెకన్లు&period;&period; అంటే అన్ని టేకులకి కలిపి దాదాపు నాలుగు గంటల ఫిలిం క్లాపు వల్ల ఖర్చవుతుంది&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒక్కో నిముషం కోడక్ ఫిలిం ఖరీదు అప్పట్లో రెండువేల రెండొందల యాభై రూపాయలు &lpar;నాకు గుర్తున్న ఖరీదు&rpar;&period;&period; సో&comma; నాలుగు గంటల ఫిలిం అంటే అయిదున్నర లక్షల రూపాయలు&period;&period; ఇదీ క్లాప్ బోర్డు వల్ల వేస్టయే ఫిలిం ఖరీదు&period;&period; సరైన క్లాప్ అసిస్టెంటు దీన్ని సగానికి సగం తగ్గించగలడు&period;&period; అందుకే కొన్ని చిన్న బడ్జెట్ సినిమాలు అప్పట్లో క్లాప్ లేకుండా కూడా చేసేసి ఆ తరవాత ఎడిటింగు టేబుల్ మీద నానా తంటాలూ పడ్డ సినిమాలు నాకు తెలుసు&period;&period; నేను మొదట్లో క్లాప్ కొట్టడానికి తీసుకున్నప్పుడు తడబడ్తోంటే మా గురువు దాసరిగారు స్వయంగా తను తీసుకుని చెప్పారు&period;&period; ఒకరోజు క్లాప్ బోర్డు లొకేషనుకి తీసుకురాకపోతే నేను సీను వివరాలన్నీ చదివి చేతులతో క్లాప్ కొట్టిన సందర్భమూ బాగా గుర్తు&period;&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts