Mahesh Babu Hobbies : కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు ఆనతి కాలంలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మనస్తత్వం మహేష్ బాబుది. సూపర్ స్టార్ మహేష్ బాబుది గోల్డెన్ హార్ట్ అంటూ కొనియాడుతారు అభిమానులు. అందులో అతిశయోక్తి ఏమీ లేదు. దేశంలోనే అత్యధిక పారితోషకం అందుకునే నటుల్లో ఒకడైన మహేష్.. ఎన్నో ఏళ్ల నుంచి తన ఆదాయంలో కొంత భాగాన్ని ఛారిటీ కోసం ఉపయోగిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఒక ఆసుపత్రి భాగస్వామ్యంతో అతను ఎంతోమంది అభాగ్యులైన చిన్నారుల ప్రాణాలు కాపాడాడు.
మహేష్ బాబు ఫౌండేషన్ పేరు మీద 2500 గుండె ఆపరేషన్లు జరిగాయంటే ఆయన మంచి మనస్సు ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. తన కొడుకు పుట్టినపుడు చిన్న ఇబ్బంది తలెత్తితే.. అది చూసి పేద చిన్నారులకు సమస్య తలెత్తితే ఎలా అనే ఆలోచనతో ఈ గొప్ప పనికి శ్రీకారం చుట్టారు మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన పేరు మీద విద్యా నిధి పథకాన్ని ప్రారంభించాడు. ప్రాథమికంగా 40 మంది ప్రతిభావంతులైన పేద విద్యార్థులను ఎంచుకుని.. వారికి స్కూల్ స్థాయి నుంచి పీజీ వరకు ఆర్థిక సాయం అందించనున్నారు.తండ్రికి మహేష్ ఇస్తున్న గొప్ప నివాళి ఇదంటూ ఆయన మీద ప్రశంసలు కురుస్తున్నాయి.
అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్న కూడా మహేష్ ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయిస్తాడు. ఇంక ఖాళీ ఉంటే పుస్తకాలు ఎక్కువగా చదువుతాడట. మనసు ప్రశాంతంగా ఉంచుకునేందుకు ఎన్నో రకాల బుక్స్ మహేష్ చదువుతాడనే టాక్ ఇప్పుడు ఉంది.