వినోదం

ఇంట్లో అంత మంది హీరోలు ఉన్నా చిరంజీవి తల్లికి మాత్రం ఆ హీరో అంటే ఇష్టమట…!

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో ఇప్పటికీ నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న సంగతి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటి జనరేషన్ స్టార్ హీరోలు, యంగ్ హీరోలను మించే విధంగా చిరంజీవి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు నమోదు చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఐతే టాలీవుడ్ లోని స్టార్ ఫ్యామిలీ లలో మెగా ఫ్యామిలీ కూడా ఒకటి. ఈ ఫ్యామిలీ నుండే ఎక్కువ మంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అంతమంది హీరోలు మెగా ఫ్యామిలీ నుండి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడానికి చిరంజీవి కారణం.

అయితే మెగా ఫ్యామిలీలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో పాటు, వరుణ్ తేజ్, రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్ లాంటి హీరోలు ఉన్నా కూడా, చిరు తల్లి అంజనదేవికి మాత్రం ఫేవరెట్ హీరో మరొకరు ఉన్నారు. ఆయన మరెవరో కాదు. ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా అమ్మాయిల కలల రాకుమారుడు గా రాణించిన అక్కినేని నాగేశ్వరరావు. ఒకప్పుడు అక్కినేని ఎక్కువగా ప్రేమ కథ చిత్రాల్లోనే నటించేవారు. దాంతో ఆయనకు లేడీ ఫ్యాన్స్ కూడా ఎక్కువగానే ఉండేవారు. ఇక అంజనదేవికి కూడా ఊహ తెలిసిన నాటి నుండి అక్కినేని అంటే చాలా ఇష్టమట.

do you know which actor chiranjeevi likes most

ఆమె అక్కినేనికి వీరాభిమాని అంట. మరోవైపు చిరంజీవి అన్నగారు ఎన్టీఆర్ కూడా కు వీరాభిమాని, ఆయనను ఆదర్శంగా తీసుకునే చిరంజీవి సినిమాల్లోకి వచ్చారు. అలా ఎంట్రీ ఇచ్చిన చిరు తక్కువ కాలంలో తన టాలెంట్ ను నిరూపించుకొని, స్టార్ హీరోగా ఎదిగారు. అక్కడితో ఆగకుండా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. పవన్ కూడా స్టార్ హీరోగా ఎదిగి, ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం పవన్ సినిమాలతో పాటు, రాజకీయాల్లో కూడా చురుకుగా వ్యవహరిస్తున్నారు.

Admin

Recent Posts