వినోదం

Super Star Krishna : కృష్ణ‌కు అస‌లు సూప‌ర్ స్టార్ అనే బిరుదు ఎలా వ‌చ్చింది.. దీని వెనుక ఉన్న క‌థ తెలుసా..?

Super Star Krishna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తొలిసారి ఈస్ట్‌మన్‌ కలర్‌, 70 ఎంఎం, సినిమా స్కోప్‌, కౌబాయ్‌, జేమ్స్‌ బాండ్‌ మూవీలు తీసిన ఘనత కృష్ణ సొంతం. సూప‌ర్ స్టార్,మెగాస్టార్ వంటి బిరుదులు ఆ రోజుల్లో సొంతం చేసుకోవ‌డం అంత ఆషామాషీ కాదు. కాని కృష్ణ మాత్రం సూప‌ర్ స్టార్ ట్యాగ్ ద‌క్కించుకొని ఓ వెలుగు వెలిగారు.

నిజానికి అభిమానులే కృష్ణను సూపర్‌ స్టార్‌ను చేసింది. అది కూడా తమ ఓట్ల ద్వారా కావడం విశేషం. మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, ఈనాడులాంటి విలక్షణమైన సినిమాలు చేసిన కృష్ణను అభిమానులు ఎంతగానో ఆదరిస్తున్న క్ర‌మంలో అప్పట్లో ఓ తెలుగు, తమిళ మ్యాగజైన్‌ ఒకటి ఓ పోల్‌ నిర్వహించింది. పోస్ట్‌ ద్వారా ఓట్లు వేసి మరీ తమ అభిప్రాయాలను చెప్పాలి. అలా సూపర్‌ స్టార్‌ ఆఫ్‌ ద ఇయర్‌ ఎవరు అన్న పోల్‌ను ప్రతి ఏటా ఆ మ్యాగజైన్‌ నిర్వహించేది.

do you know who has given super star tag to krishna

ఇందులో వరుసగా ఐదేళ్ల పాటు కృష్ణ టాప్‌లో నిలవడం విశేషం. దీంతో అప్పటి నుంచి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కృష్ణను సూపర్‌ స్టార్‌ అని పిలవడం మొదలుపెట్టారు. గ‌తంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా కృష్ణనే ఈ విషయాన్ని స్వ‌యంగా వెల్లడించాడు. ప్రొడ్యూసర్ల హీరోగా కృష్ణకు మంచి పేరుంది. తనను నమ్మి సినిమా చేసిన నిర్మాత ఎప్పుడూ బాగుండాలని కోరుకునే మొద‌టి వ్యక్తి కృష్ణ. ఒక సినిమా ఫ్లాపయి సదరు నిర్మాత కష్టాల్లో పడితే.. తర్వాతి సినిమాను ఫ్రీగా చేసిపెట్టి హిట్‌ ఇచ్చిన మొనగాడు మ‌న సూప‌ర్ స్టార్ కృష్ణ‌.

Admin

Recent Posts