వినోదం

గజినీ వంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను వదులుకున్న 12 మంది హీరోలు ఎవరో తెలుసా..?

సూర్య సినిమాలకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. హీరో సూర్యకి తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు అనేది గజిని సినిమా వల్ల ఏర్పడిందే అని చెప్పాలి. అంతకు ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సెకండ్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తూ వచ్చిన సూర్య గజిని తో ఒక్కసారిగా స్టార్ అయిపోయాడు. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2005వ సంవత్సరం సెప్టెంబర్ 29న తమిళ మరియు తెలుగు భాషల్లో ఏక కాలంలో రిలీజ్ అయ్యింది.

హారిస్ జయరాజ్ సంగీతంలో రూపొందిన పాటలు ఈ చిత్రానికి మరో హైలెట్ అని చెప్పవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఇరు భాషలలోనూ ఘనవిజయాన్ని అందుకుంది. అటు తమిళ్, ఇటు తెలుగులోనూ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన గజిని చిత్రం వెనక ఎంతో కథ నడిచింది. మొదటిగా ఈ చిత్ర కథను విని దాదాపు 12 మంది హీరోలు ఈ కథను రిజెక్ట్ చేశారట. ఇంతకీ గజిని లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం వదులుకున్న ఆ హీరోలు ఎవరు ఇప్పుడు చూద్దాం.

రమణ అనే చిత్రంతో మురుగదాస్ తమిళ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ స్టేటస్ ని సంపాదించుకున్నారు. రమణ చిత్రం తర్వాత మురుగుదాస్ డైరెక్షన్ లో వచ్చిన రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించాయి. ఆ తర్వాత తీయబోయే సినిమా కూడా భిన్నంగా ఉండాలని భావించి హాలీవుడ్ మూవీ అయినా మెమెంటో లైన్ బేస్ చేసుకొని ఒక కథ సిద్ధం చేసుకున్నాడు మురుగదాస్. 2003 లో ఆ కథను పట్టుకొని స్టార్ హీరోల దగ్గరకు వెళ్లడం మొదలు పెట్టారట.

do you know who missed to do ghajini movie

మొదటిగా తెలుగు సినీ నిర్మాత అయినా సురేష్ బాబుకు కథను వినిపించారు. తన బ్యానర్ లో ఈ సినిమా చేయడానికి అంగీకరించిన సురేష్ బాబు ఇంత రిస్క్ కథ కదా ఏ హీరో చేస్తారు అని అడగడం జరిగిందట. మహేష్ బాబు అయితే బాగుంటుంది అని మురుగదాస్ చెప్పడం జరిగింది. అయితే మహేష్ బాబు ఈ కథ తనకు సూట్ కాదని రిజెక్ట్ చేయడంతో వెంకటేష్ తో చేయాలనీ అనుకున్నారు మురుగదాస్. గుండు గెటప్ చేసేందుకు వెంకటేష్ నో చెప్పడంతో ఈ కథ కాస్త పవన్ కళ్యాణ్ వద్దకు చేరింది. అప్పటికే జానీ సినిమాతో ప్లాప్ అందుకున్న పవన్ కళ్యాణ్ గజిని కథను చేయడానికి ఆసక్తిని చూపించలేదు.

ఇక తమిళ్ హీరోలు అయినా కమల్ హసన్, విజయ్, మాధవన్ ఇలా 10 మంది స్టార్ హీరోలు ఈ కథను రిజెక్ట్ చేయడం జరిగిందట. ఇక ఈ కథను పక్కన పెట్టేయాలి అని అనుకున్న టైములో అజిత్ ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పటం జరిగింది. 2004 మార్చ్ లో షూటింగ్ స్టార్ట్ అయినా 15 రోజుల తర్వాత నిర్మాతలతో గ్యాప్ రావడంతో అజిత్ ఈ చిత్రం నుంచి తప్పుకున్నారట. ఇక ఈ సినిమా కోసం ఫైనల్ గా సూర్యని సంప్రదించి కథ వినిపించగా, సూర్య కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చేసేసాడు. అలా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గజినీ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Admin

Recent Posts