అరుంధతి సినిమాలో షాయాజీ షిండే కంటికి కనిపించేవన్ని నిజాలు కావు కనబడనవన్ని అబద్ధాలు కావు అనట్టే ఉంటుంది సినిమా ప్రపంచం కూడా. మనం తెర మీద చూసే వాటి వెనుక చాలా పెద్ద తతంగమే ఉంటుంది. తెర వెనుక జరిగే ప్రక్రియను చూస్తే కనుక ఏంటి ఇదంతా నిజం కాదా ఇన్నాళ్లు నిజం అనుకున్నానే అని ఎదో సినిమాలో బ్రహ్మానందం పెట్టిన ముఖ కవళిక పెడతారు. అవునండీ బాబూ మనం తెర మీద చూసే వాటిలో సగం గ్రాఫిక్సే మరీ. నమ్మరా అయితే యూట్యూబ్లో షూటింగ్ వీడియోలు చూస్తే అర్ధం అవుతుంది.
ఈ కాలం వాళ్ళకి గ్రాఫిక్స్ పరిచయం ఉన్న కూడా సినిమాలో కొన్ని సన్నివేశాలకి గ్రాఫిక్స్ ఉపయోగించాము అని సినిమా వాళ్ళు చెప్తే కానీ తెలియదు అంత మాయ చేస్తారు మరీ. ఇక ప్రశ్న దగ్గరకి వస్తే ఈ గ్రాఫిక్స్ కోసం షూటింగ్ వెనకాల ఆకుపచ్చ రంగు స్క్రీన్ పెడతారు. షూటింగ్ అయ్యాక సినిమాను గ్రాఫిక్స్ చేయడం కోసం క్రోమ కీఇంగ్ అనే ఒక పద్ధతిని వాడతారు.
ఆ పద్ధతి ప్రకారం షూటింగ్ లో ఏదీ/ఎవరు ఉండాలి ఏం మార్చాలి అనేది తేలికగా తెలియడానికి వాళ్ళ వెనుక ఒక స్క్రీన్ పెడతారు. అది ఎక్కువ శాతం ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. దానికి కూడా ఒక కారణం ఉంది మిగత రంగుల కంటే ఆకుపచ్చ రంగు అనేది మనిషి చర్మానికి, జుట్టుకి దేనికి పోలిక లేకుండా ఉంటుది. అందుకే దాన్నే ఎక్కువగా వాడతారు. ఇదే కాకుండా తెలుపు, నలుపు, గ్రే రంగులు కూడా వాడతారు.