వినోదం

2024 లో విడుదలైన రజాకార్ సినిమా ఎలా ఉంది ?

ఒక్క ముక్క లో చెప్పాలంటే .. ఆడియన్స్ రియాక్షన్ సేమ్ టూ సేమ్ … ఈ మూవీ విషయం లో .. చాలా నిజంగా జరిగిన చరిత్రని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. బ్లడ్ బోయిల్ అయిపోయింది , రక్తం తన్నుకొని వస్తోంది అని ఒక ఆడియో ఫంక్షన్ లో బండ్ల గణేష్ చెప్పినట్టు , థియేటర్లో నిజాం చేసిన అరాచకాలు చూస్తున్నప్పుడు క్లైమాక్స్ లో మన ఫీలింగ్ ఇలానే ఉంటది. నిజాం పాలనలో జరిగిన దారుణాలు , అతని అనుచర, సైనిక దళం చేసిన అకృత్యాలు కళ్ళకు కట్టినట్టు చూపిచ్చాడు దర్శకుడు. ఎంతైనా రాజమౌళితో చేశాడు కాబట్టి , పైగా ఇద్దరి గురువు రాఘవేంద్రరావు కావటంతో టేకింగ్ మార్క్ కనిపిస్తుంది.

అందరి పర్ఫార్మన్స్లు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఇది హిందూ ,ముస్లిం ఇష్యూ కాదు . నిజాం కాలంలో , మతాలతో సంబంధం లేకుండా అందరినీ హింసించారు. BGM హైలైట్ గా నిలిచింది.. సినిమాటోగ్రఫీ కలర్ఫుల్గా , యాక్షన్ సీన్ ఫైర్ గా ఉన్నాయి.

how is rajakar movie

అప్పుడు నిజాం పై యుద్దం చేయాలి అని నిర్ణయించిన సర్దార్ వల్లభాయి పటేల్కూ , భారత సైనికులకూ , ఎందరో అమరవీరులకూ నివాళులర్పించుకుంటూ .. కుదరితే మూవీని చూడండి..

Admin

Recent Posts