వినోదం

కళ్ళు చిదంబరం కంటి ఆపరేషన్ ఎందుకు చేయించుకోలేదో తెలుసా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్నంతమంది కమెడియన్లు ఎక్కడా ఉండరు. ఒకప్పుడు కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది తెలుగు ఇండస్ట్రీ. ఈ విషయాన్ని అంతా గర్వంగా చెప్పుకుంటారు. ఇలా అప్పట్లో బాగా ఫేమస్ అయిన వారిలో కళ్ళు చిదంబరం ఒకరు. ఆయన అసలు పేరు కొల్లూరి చిదంబరం. 1945లో విశాఖపట్నంలో జన్మించిన ఆయన కళ్ళు అనే చిత్రం ద్వారా తెలుగు సినిమాలలొకి తెరంగేట్రం చేశాడు. తన మొదటి సినిమా పేరును తన ఇంటిపేరుగా మార్చుకొని మంచి గుర్తింపును పొందాడు కళ్ళు చిదంబరం. ఆయన 300కు పైగా సినిమాలలో నటించాడు.

కళ్ళు చిత్రం తర్వాత, అమ్మోరు, చంటి, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం రా, ఆ ఒక్కటి అడక్కు, ఇలా తదితర చిత్రాలలో నటించి ప్రత్యేకమైన పాత్రలు పోషించి మంచి గుర్తింపుని పొందారు. ఆయన కళ్ళు అలా ఉండడం వల్లే సినిమాలలో కమెడియన్ గా మంచి అవకాశాలు వచ్చాయి. ఇక ఆయన అప్పట్లో చాలామంది పేద కళాకారులకు తనకు తోచినంత సహాయం చేసే వారని చాలామంది చెప్పుకుంటారు. కళ్ళు చిదంబరం 2015 లో అనారోగ్యం కారణం వల్ల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆయన నటనలోని మాట తీరు కూడా ప్రేక్షకులను ఎంతగానో నవ్వించేది. అయితే ఆయన సినిమాలలో నటించి ఎంత డబ్బుు సంపాదించినప్పటికీ ఆయన కంటికి మాత్రం ఆపరేషన్ చేయించుకోలేదు. దానికి గల కారణం..

do you know why kallu chidambaram did not done surgery to his eyes

ఆపరేషన్ చేయించుకుంటే కచ్చితంగా సమస్య తీరిపోయేదే అయినప్పటికీ ఆయన మాత్రం చేయించుకోవడానికి ఇష్టపడలేదు. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేని సమస్యతో తన కంటిలో నరాలు దెబ్బతిని మెల్లకన్ను వచ్చింది. అయితే సినిమాలలోకి వచ్చిన తర్వాత కంటికి ఆపరేషన్ చేయించుకోవాలని ఆయన భావించారు. కానీ ఆయనకి సినిమాలలో ఎక్కువగా అవకాశాలు రావడానికి గల కారణం ఆ కళ్ళే కావడంతో ఆపరేషన్ వద్దని ఆగిపోయారట. ఆపరేషన్ చేయించుకోనప్పటికీ ఎటువంటి సమస్య ఉండదని వైద్యులు చెప్పడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

Admin

Recent Posts