వినోదం

Star Actress : అప్పట్లో స్టార్‌ హీరోలందరితోనూ నటించిన ఈమె.. ఎవరో గుర్తు పట్టగలరా..?

Star Actress : ప్రస్తుత తరుణంలో సోషల్‌ మీడియాలో సెలబ్రిటీలకు చెందిన చిన్ననాటి ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు ఆ ఫోటోలను ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ చిన్నారి ఫొటో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తు పట్టారా.. ఈమె తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం భాషలకు చెందిన చిత్రాల్లో నటించింది. మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఫ్యామిలీ టైప్‌ ఆడియన్స్‌కు దగ్గరైంది. ఇంకా ఈమె ఎవరో కనిపెట్టలేదా..

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిన వారిలో స్నేహ కూడా ఒకరు. ఈమె అక్టోబర్‌ 12, 1981వ తేదీన జన్మించింది. ఈమెది ముంబై. తెలుగు కుటుంబమే కానీ అక్కడ సెటిల్‌ అయ్యారు. ఈ క్రమంలోనే స్నేహ నిలపక్ష అనే మళయాళ సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తరువాత టాలీవుడ్‌ లవర్‌ బాయ్‌గా పేరుగాంచిన తరుణ్‌కు జోడీగా అప్పట్లో ప్రియమైన నీకు అనే మూవీలో నటించింది. ఈ మూవీ టైటిల్‌ సాంగ్‌ ఎంత హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ తరువాత స్నేహకు వరుసగా అవకాశాలు వచ్చాయి.

have you identified this actress in this photo sneha

ఇక స్నేహ తన అందం, అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులకు దగ్గరైంది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈమె చూపులకు చాలా అమాయకంగా కనిపిస్తుంది. ఇక స్నేహ తన కెరీర్‌లో ఎంతో మంది స్టార్‌ హీరోలతో యాక్ట్‌ చేసింది. వెంకీ, హనుమాన్‌ జంక్షన్‌, శ్రీరామదాసు వంటి సినిమాల్లో నటించగా.. అవి హిట్‌ అయ్యాయి. దీంతో అప్పట్లో ఈమె హీరోలకు ఫేవరెట్‌ హీరోయిన్‌ అయింది. ఇక స్నేహ చిన్ననాటి ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Admin

Recent Posts