Uday Kiran : అప్పట్లో లవర్ బాయ్ ఎవరు అని అడిగితే మనకు రెండు పేర్లు మాత్రం ఠక్కున గుర్తుకు వచ్చేవి. ఒకటి ఉదయ్ కిరణ్, రెండు తరుణ్. ఈ ఇద్దరూ అప్పట్లో తెగ ఊపు ఊపారు. వరుస విజయాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. వరుసగా లవ్ కథాంశంతో సినిమాలను తీసి హిట్ కొట్టారు. దీంతో వీరికి లవర్ బాయ్ ఇమేజ్ వచ్చింది. అయితే తరువాత ఈ ఇద్దరికీ సినిమా అవకాశాలు తగ్గాయి. కానీ ఉదయ్ కిరణ్ మాత్రం మనస్థాపంతో ఆత్మహత్య చేసుకోగా.. తరుణ్ మాత్రం మనకు సినిమాల్లో కనిపించడం లేదు.
అయితే అప్పట్లో ఈ ఇద్దరినీ పెట్టి ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు ఒక సినిమా తీద్దామని అనుకున్నారు. అదే నీ స్నేహం. అందులో ఉదయ్ కిరణ్, తరుణ్ మంచి స్నేహితులుగా నటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల తరుణ్ నో చెప్పాడు. దీంతో తరుణ్ పాత్రలో జతిన్ గ్రేవాల్ అనే వేరే నటున్ని తీసుకున్నారు. అయితే మొత్తంగా చెప్పాలంటే కథ బాగున్నా.. సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేదు. అందులో జతిన్‌కు బదులుగా తరుణ్ చేసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేదని నిర్మాత ఎంఎస్ రాజు ఇప్పటికీ చెబుతుంటారు.
నీ స్నేహం మూవీలో ఉదయ్ కిరణ్‌కు జోడీగా ఆర్తి అగర్వాల్ నటించింది. ఈ మూవీ 2002 నవంబర్ 1న రిలీజ్ అయింది. ఆరంభంలో మంచి వసూళ్లనే రాబట్టినా.. తరువాత బాక్సాఫీస్ వద్ద నెమ్మదించింది. దీంతో ఈ మూవీ యావరేజ్ టాక్‌తో సరిపెట్టుకుంది. అయితే అప్పట్లో ఉదయ్, తరుణ్‌ల కాంబినేషన్‌లో గనక ఈ మూవీ వచ్చి ఉంటే అది ఇద్దరికీ ప్లస్ అయి ఉండేది. కానీ కొన్ని కారణాల వల్ల తరుణ్ యాక్ట్ చేయలేదు. దీంతో ఈ మూవీ యావరేజ్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత కొంత కాలానికి ఇద్దరూ సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు.