Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం
No Result
View All Result
Ayurvedam365
Home వినోదం

కాంతార సినిమాలో ఈ మిస్టేక్ ను గమనించారా?

Admin by Admin
April 7, 2025
in వినోదం, వార్త‌లు
Share on FacebookShare on Twitter

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన కాంతారా మూవీ దేశవ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టించింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన కన్నడ చిత్రం కాంతారా. ఈ సినిమా నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది.

దాదాపు 16 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ సినిమా 450 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. కన్నడంతో పాటు బాలీవుడ్, టాలీవుడ్ లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. భూతకోల‌ అనే కళ నేపథ్యంతో విలేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రిషబ్ శెట్టి ఈ సినిమాను తెరకెక్కించారు. నటుడిగా, దర్శకుడిగా ఈ సినిమాతో రిషబ్ శెట్టి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు.

ఇదిలా ఉండగా, ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యాక సోషల్ మీడియాలో ఏదో ఒక చర్చ జరుగుతుంది. కొంతమంది ఈ సినిమా లాజిక్ లెస్ అని అంటున్నారు. ఈ సినిమా కథలోనే చాలా లాజిక్ మిస్ అయ్యిందట. ఆ మిస్టేక్ ఎలా గాలికి వదిలేశారు అంటూ నెటిజెన్లు నెత్తి కొట్టుకుంటున్న ఈమోజీలు పెడుతున్నారు. అసలు మేటర్ ఏంటంటే, ఈ సినిమాలో కోలం ఆడే వ్యక్తిలో దేవుడు ప్రవేశించి జరగబోయేది చెబుతుంటాడు. ఒక రాజు అడవిలో ఉండే జనాలకు తన భూమిని దానం చేస్తాడు. కొన్నాళ్ల తర్వాత అతని వారసుడు వచ్చి ఆ భూమి నాది అంటాడు. కోలం ఆడే వ్యక్తితో అతను నా భూమి నాకు కావాలి అంటాడు.

have you identified this small mistake in kantara movie

అప్పుడు ఆ కోలం ఆడే వ్యక్తిలో దేవుడు ప్రవేశించి నువ్వు కోర్టు మెట్లపై రక్తం కక్కుకొని చనిపోతావు’అంటాడు. అతను అన్నట్టే ఆ వ్యక్తి కోర్టు మెట్లపై రక్తం కక్కుకుని చనిపోతాడు. ఇంకొన్నాళ్ళ తర్వాత ఆ రాజ కుటుంబానికి చెందిన వారసుల్లో ఇంకో వ్యక్తి కూడా భూమిని ఆక్రమించుకోవాలి అని కుట్రలు పన్నుతుంటాడు. ఇదే క్రమంలో హీరో బాబాయి కొడుకు కోలం ఆడుతూ ఉంటాడు. క్లైమాక్స్ లో కోలం ఆడే వ్యక్తిని తన స్వార్థం కోసం చంపేస్తాడు ఆ రాజు కుటుంబానికి చెందిన వంశీయుడు.

అలాగే అక్కడి జనాలను కూడా దారుణంగా కాల్చి చంపేస్తాడు. చివర్లో హీరో కూడా కోలం ఆడతాడు. అతను తన ప్రజలను, వారికి సాయం చేసిన పోలీస్ ఆఫీసర్ కు అప్పగిస్తున్నట్లు సినిమాలో చూపించారు. అయితే కోలం ఆడే వ్యక్తిలో నిజంగా దేవుడు వస్తే, ఆ రాజు కుటుంబానికి చెందిన వ్యక్తి అనగా, ఆ ఊరికి పెద్దదిక్కు అని జనాలు నమ్ముతున్న వ్యక్తి దుర్మార్గుడు అని ఎందుకు ఆ ప్రజలకు చెప్పలేదు. ముందుగానే తెలియజేస్తే ఆ ప్రజలు జాగ్రత్త పడతారు కదా? అనేది నెటిజన్ల అభిప్రాయం. కానీ ఆ లాజిక్ ను ఏ మాత్రం మేకర్స్ పట్టించుకోలేదు. ఇక ప్రేక్షకులు కూడా ఈ లాజిక్ ను పూర్తిగా పక్కన పెట్టేసి స్క్రీన్ ప్లేని మాత్రమే ఎంజాయ్ చేశారు.

Tags: kantara
Previous Post

నిద్రించేట‌ప్పుడు త‌ల కింద దిండు అవ‌స‌ర‌మా..? అది లేకుండా నిద్రిస్తే ఏం జ‌రుగుతుంది..?

Next Post

పురుషుడి చూపును బట్టి స్త్రీ ఏం గమనిస్తుందో తెలుసా..?

Related Posts

చిట్కాలు

ఈ చిట్కాల‌ను పాటిస్తే క‌ళ్ల కింద ఉండే డార్క్ స‌ర్కిల్స్ దెబ్బ‌కు మాయం అవుతాయి..!

June 14, 2025
చిట్కాలు

మీ ముఖంపై ఉండే ముడ‌త‌లు పోయి అందంగా క‌నిపించాలంటే.. ఈ చిట్కాల‌ను పాటించండి..!

June 14, 2025
హెల్త్ టిప్స్

పొట్ట ద‌గ్గరి కొవ్వు క‌ర‌గాల‌ని చూస్తున్నారా.. అయితే వీటిని తాగండి..

June 14, 2025
information

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా A171 విమాన ప్రమాదం.. మేడే కాల్ అంటే ఏంటి?

June 14, 2025
technology

గూగుల్ వంటి పెద్ద కంపెనీలలో వాడి పడేసిన పాత కంప్యూటర్లను ఏమి చేస్తారు?

June 14, 2025
హెల్త్ టిప్స్

ఒక‌టే ప‌టిక‌.. ఎన్నో ఉప‌యోగాలు..!

June 14, 2025

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
చిట్కాలు

అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డే ఆరోగ్య చిట్కాలు.. సేవ్ చేసుకోవ‌డం మ‌రిచిపోకండి..!

by Admin
June 13, 2025

...

Read more
న‌ట్స్ & సీడ్స్

Flax Seeds In Telugu : అవిసె గింజ‌ల‌ను ఎలా తీసుకోవాలో తెలుసా..? పొర‌పాటు చేయ‌కండి..!

by D
May 18, 2024

...

Read more
ఆధ్యాత్మికం

Balli Sastram : మీ శ‌రీరంలో ఏ భాగంపై బ‌ల్లి ప‌డింది.. దాన్ని బ‌ట్టి మీకు ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయంటే..?

by Editor
May 15, 2024

...

Read more
హెల్త్ టిప్స్

మీ మెద‌డు ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే వీటిని తినండి..!

by Admin
June 7, 2025

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2021. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ప్ర‌శ్న – స‌మాధానం
  • పోష‌కాహారం
  • ఆహారం

© 2021. All Rights Reserved. Ayurvedam365.

error: Content is protected !!